లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలి: బండి సంజయ్‌

లాక్‌డౌన్‌‌ పొడిగింపుపై భాజపా కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. దేశహితం కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. లాక్‌డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా … Read More

ముంబయిలో మరో 11 కరోనా మరణాలు

మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో కొవిడ్‌ 19 మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఈ రోజు కొత్తగా మరో 11 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ముంబయి మహానగరంలో మరణాల సంఖ్య 75కి చేరినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. అలాగే, నగరంలో … Read More

గుడ్ ఫ్రైడే మార్కెట్లకు సెలవు

దేశీయస్టాక్ మార్కెట్లుకు సెలవు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (శుక్రవారం 10) మార్కెట్లకు సెలవు. అలాగే బులియన్‌, కమోడిటీ మార్కెట్లు,  ఫారెక్స్‌ మార్కెట్లు సైతం పనిచేయవు. సోమవారం(13న) ఉదయం 9.15కు  యథావిధిగా ప్రారంభమవుతుంది. సెన్సెక్స్ 1266 పాయింట్లు ఎగిసి 31,160 వద్ద … Read More

హైదరాబాద్‌ ఇళ్ల అమ్మకాల్లో 41 శాతం క్షీణత

రియల్టీ జోరుకు కళ్లెం పడింది. కోవిడ్‌-19 ప్రభావం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 29 శాతం తగ్గగా హైదరాబాద్‌లో ఆ తగ్గుదల 41 శాతం ఉంది.  హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో మూడు నెలల … Read More

పొదుపు ఖాతాపై వడ్డీ రేటు తగ్గించిన ఎస్‌బీఐ

 రెపో రేటు తగ్గింపు ప్రభావం బ్యాంకుల పొదుపు ఖాతా (ఎస్‌బీ) డిపాజిట్లపైనా పడింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును ప్రస్తుత మూడు శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ … Read More

హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ పునరుద్ధరణ

హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ, అమెజాన్‌ ఫ్రెష్‌ సర్వీసులను పునరుద్ధరించినట్టు ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తెలిపింది. వరంగల్‌లోనూ అమెజాన్‌ పాంట్రీ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. వీటి ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిత్యావసర సరుకులను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. 

వ్యాక్సిన్ల తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయ్‌

కరోనా వైరస్‌ కట్టడి కోసం వ్యాక్సిన్ల తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాటం సాగిస్తున్నాయని.. ప్రజలు సైతం ఈ పోరాటంలో … Read More

డబుల్ శాలరీ

కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,టెస్టింగ్ ల్యాబ్ స్టాఫ్ లకు డబుల్ శాలరీ(రెట్టింపు జీతం)ఇవ్వనున్నట్లు గురువారం(ఏప్రిల్-9,2020)సీఎం … Read More

కరోనానుకూడా కట్టడి చేస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో గురువారం రాత్రి 9గంటల వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కు చేరింది. కొత్తగా ప్రకాశంలో … Read More

మే 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన సర్వీసులను ఏప్రిల్ 30 వ తేదీ వరకూ నిలిపివేయనున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం నడపరాదని ఎయిరిండియా నిర్ణయించింది. దేశంలో లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీతో ముగియనున్న … Read More