మే 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన సర్వీసులను ఏప్రిల్ 30 వ తేదీ వరకూ నిలిపివేయనున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం నడపరాదని ఎయిరిండియా నిర్ణయించింది. దేశంలో లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఎయిరిండియా నిర్ణయం సంచలనం రేపింది. ఇదిలా ఉంటే ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్ మాత్రం డొమెస్టిక్ విమాన సర్వీసులను ఏప్రిల్ 15 వ తేదీ నుంచి నడిపేందుకు వీలుగా టికెట్ బుకింగ్ ప్రారంభించాయి. ఐతే అంతర్జాతీయ విమాన సర్వీసులు మాత్రం మే 1 వ తేదీ నుంచి నడపాలని ఇతర విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి. విస్తారా ఏప్రిల్ 15 వ తేదీ నుంచి దేశీయ విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ చేస్తోంది. ఏప్రిల్ 15 వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు, మే 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన సంస్థల అధికార ప్రతినిధులు ప్రకటించారు.