ప్రభుత్వ సారాయి దుకాణంలో దుమ్ము రేపుతున్న మోహన
ఎస్ వి ఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది రచన దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బిజేపి బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో తెలంగాణ యాసలో హీరోయిన్ మోహనసిద్ధి చెప్పిన డైలంగ్ లు గుస్ బాంబ్ లా ఉన్నాయి. ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ రాజకీయాలకు దగ్గర ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మోహన సిద్థి నటనకు, ఆమె సౌందర్యానికి అందరూ మంత్రముగ్దులవుతున్నారు.











