పొదుపు ఖాతాపై వడ్డీ రేటు తగ్గించిన ఎస్బీఐ
రెపో రేటు తగ్గింపు ప్రభావం బ్యాంకుల పొదుపు ఖాతా (ఎస్బీ) డిపాజిట్లపైనా పడింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును ప్రస్తుత మూడు శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుంది. అదనపు నిధుల సమీకరణ వ్యయం (ఎంసీఎల్ఆర్) ఆధారంగా ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ తగ్గింపు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తుంది. ఏడాది కాల పరిమితి ఉండే ఈ ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేటు ఆధారంగానే బ్యాంకులు హోమ్ లోన్స్ వంటి రుణాలు ఇస్తుంటాయి. దీంతో 30 ఏళ్ల కాలపరిమితి ఉండే హోమ్ లోన్‌పై చెల్లించే ఈఎంఐ ప్రతి రూ.లక్షకు రూ.24 చొప్పున తగ్గుతుందని ఎస్బీఐ తెలిపింది.