శేరిలింగంపల్లిలో సెంచురీ మ్యాట్రెసెస్ స్టోర్‌ను ప్రారంభించిన పీవీ సింధు
హైదరాబాద్, 26 సెప్టెంబర్, 2025: భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెసెస్ బ్రాండ్ సెంచురీ మ్యాట్రెసెస్ తన కొత్త ఎక్స్పీరియెన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఘనంగా ప్రారంభించింది. ఈ స్టోర్‌ను పద్మభూషణ్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, తెలంగాణ శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీఆరికెపూడి గాంధీ, అలాగే సెంచురీ మ్యాట్రెసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ కలిసి ప్రారంభించారు.
ఈ కొత్త స్టోర్‌లో సెంచురీ యొక్క మొత్తం ఉత్పత్తులన్నీ ఒకే చోట లభించనున్నాయి. ముఖ్యంగా తాజాగా లాంచ్ చేసిన సెంచురీ సోఫాస్ తో పాటు, కాపర్ జెల్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలతో ఉన్న మ్యాట్రెసెస్ ను వినియోగదారులు ప్రత్యక్షంగా అస్వాధించేలా ఈ స్టోర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తమ్ మలానీ గారు మాట్లాడుతూ” శేరిలింగంపల్లి వంటి వేగంగా ఎదుగుతున్న ప్రాంతంలో మా కొత్త ఎక్స్పీరియెన్స్ స్టోర్‌ను తెరవడం మాకు ఆనందంగా ఉంది. 30 ఏళ్లకుపైగా వినియోగదారుల నమ్మకాన్ని అందిస్తున్న సెంచురీ, ఇప్పుడు బెడ్‌రూమ్ నుండి లివింగ్‌రూమ్ వరకు తన కంఫర్ట్ సైన్స్‌ను విస్తరించింది” అని అన్నారు.
ఈ సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించారు. కొన్ని ఉత్పత్తులపై ఒకటి కొంటే మరొకటి ఉచితంగా అలాగే ఉచిత పిల్లో సెట్‌లు అందిస్తున్నామని తెలిపారు.
సెంచురీ మ్యాట్రెసెస్బ్రాండ్ అంబాసడర్ పీవీ సింధు మాట్లాడుతూ”నా ప్రదర్శనలో కంఫర్ట్ చాలా కీలకం. సెంచురీ ఆ నమ్మకాన్ని అద్దం పడుతుంది. వినియోదారులు ఇక్కడ ప్రత్యక్షంగా ఈ కంఫర్ట్ ఇన్నోవేషన్స్ ను అనుభవించగలగడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.
కంపెనీ సామాజిక బాధ్యతలో భాగంగా, 100 మ్యాట్రెసెస్ ను ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు మరియు వెనుకబడిన వర్గాల వారికి విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
ఈ కొత్త ఎక్స్పీరియెన్స్ స్టోర్ శేరిలింగంపల్లిలో ప్రారంభం కావడంతో, హైదరాబాద్‌లో బంజారాహిల్స్, మియాపూర్ తరువాత ఇది మూడో ఎక్స్పీరియెన్స్ సెంటర్ గా నిలిచింది.











