బాలి చిత్రంలో అందాలు ఆరాబోస్తున్న మోహన

వర్ధమాన తారా మోహన సిద్ధి చిత్రసీమలో దూసుకుపోతుంది. ఇటీవల నటించిన సినిమాల్లో మంచి పేరు సంపాధించిన ఆమె మరో అడుగు ముందుకు వేసింది. పాలిక్ స్టూడియోస్, బి ఎస్ ఆర్ కె, డి ఆర్ ఎస్ మరియు ఆర్ ఎస్ క్రియేషన్ టీమ్ వర్క్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “బాలి”. ఈ చిత్రానికి పాలిక్ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. మారుమూల ప్రాంతంలోని ఒక తాండాలో జరిగిన యధార్థ కథని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తిగా గ్రామీణ ప్రాంత నేపథ్యం కావడంతో అచ్చుగుద్దినట్టుగా పల్లెటూరు అమ్మాయిలా తన నటనతో యువతను మంత్రముగ్దుల్ని చేస్తున్నది. తన అందచందాలతో ఇప్పటికేే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేకుండా చేస్తున్న మోహన ఈ చిత్రంతో ముందుకు రాబోతుంది.

రెండు జన్మలకు సంబంధించిన ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ మనిషికి భగవంతుడు తోడైతే అనే ఒక మంచి కథ నేపథ్యంతో నిర్మిస్తున్న చిత్రం “బాలి”. ఈ చిత్రంలో ఐదు పాటలు, ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు, కామెడీ, సెంటిమెంట్ అన్ని కల కలుపుకొని ఒక చక్కటి జానపద చిత్రంగా మీ ముందుకు రాబోతుంది అన్నారు దర్శకుడు పాలిక్. ఈ చిత్రం యొక్క పోస్టర్ మరియు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ఇటీవల మేడారం, ఏటూరు నాగారం, ఛత్తిష్ ఘడ్ సరిహద్దుల్లో మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన లొకేషన్ల లో చిత్రీకరించారు. ఈ చిత్రం లో గబ్బర్ సింగ్ సాయి, సుమన్ శెట్టి, జీవ,శ్రీమన్, మోహన, రఘు, అనిరుద్, ఐశ్వర్య, రేవతి, సంజయ్ పాటిల్ , మానస.. తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం జాన్ భూషణ్, పాటలు: సురేష్ గంగుల, కెమెరామెన్: ఆనం వెంకట్, ఆర్ట్ :నరేష్ , సత్య నగేష్, నాయుడు, ఎడిటర్: నిశాంత్, పి ఆర్ ఓ : చందు రమేష్, మాటలు. తోటపల్లి సాయినాథ్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: పాలిక్.

ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం 2026 లో థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్.