స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
డెక్కన్ న్యూస్: హైదరాబాద్: బుధవారం ఉదయం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,160గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,140గా నమోదైంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,120గా ఉంది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,310గా ఉండగా, చెన్నైలో రూ.1,44,150, అహ్మదాబాద్‌లో రూ.1,44,210గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గడంతో హైదరాబాద్, విజయవాడల్లో ధర రూ.2,34,900కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, డిమాండ్‌ను బట్టి బంగారం, వెండి ధరలు రోజువారీగా మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.









