రైల్వే ప్రయాణికులకు శుభవార్త
రేపటి నుంచి బుకింగ్‌లు

కరోనా వైరస్‌ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా లాక్‌డౌన్‌ మూడోసారి మే 17వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తోంది. … Read More

మాజీ ప్రధాని మన్మోహన్‌కు అస్వస్థత

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో చేర్పించారు. ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన గుండె చికిత్స … Read More

గ్లోబల్ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపుతున్న న్యూజిల్యాండ్ విశ్వ విద్యాలయాలు 

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఇటీవల విడుదల చేసిన ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌లో పరిశోధన, ఔట్‌రీచ్ మరియు స్టివార్డ్‌షిప్ విభాగాల్లో న్యూజిల్యాండ్‌కు చెందిన విశ్వవిద్యాలయాలు అగ్రగామిగా ఉన్నాయని వెల్లడైంది. అంతర్జాతీయ సస్టెయినబిలిటీ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ తన నం.1 ర్యాంకును నిలుపుకోగా, … Read More

భారత్‌లో 60వేలకు చేరువైన కరోనా కేసులు

భారత్‌లో రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి గత 24 గంటల్లో మరో 95 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,981కి చేరింది. మరో 3,320 మంది కొత్తగా వైరస్ బారినపడడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా సోకిన … Read More

లాక్‌డౌన్ నిబంధనలు‌ ఉల్లంఘించిన ‘ప్యారడైజ్‌’

సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌ లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించింది. ‘టేక్‌ అవే’ పేరిట పార్శిల్‌ సర్వీసులు ప్రారంభించింది. దీంతో బిర్యానీ కోసం పెద్ద ఎత్తున జనం క్యూ కట్టడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్‌ను మూసివేయించారు.

పోలీసు సంక్షేమానికి విరుష్క దంపతుల విరాళం

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ముంబయి పోలీస్‌ సంక్షేమానికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మ విరాళం అందజేశారు. ఒక్కొక్కరు రూ.5లక్షల చొప్పున ఇచ్చినట్టు ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌   వెల్లడించారు.  కరోనాపై యుద్ధంలో … Read More

తెలంగాణలో భారీగా పెరిగిన కరోన పాజిటివ్ కేసులు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 కేసులు తెలంగాణలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,163కి చేరింది. రాష్ట్రంలో … Read More