గ్లోబల్ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపుతున్న న్యూజిల్యాండ్ విశ్వ విద్యాలయాలు
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఇటీవల విడుదల చేసిన ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌లో పరిశోధన, ఔట్‌రీచ్ మరియు స్టివార్డ్‌షిప్ విభాగాల్లో న్యూజిల్యాండ్‌కు చెందిన విశ్వవిద్యాలయాలు అగ్రగామిగా ఉన్నాయని వెల్లడైంది. అంతర్జాతీయ సస్టెయినబిలిటీ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ తన నం.1 ర్యాంకును నిలుపుకోగా, ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (SDGs) అనుగుణంగా పరిగణనలోకి తీసుకున్న 290 సంస్థల్లో లింకన్ యూనివర్సిటీ తొమ్మదివ స్థానంలో నిలువగా, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్‌టన్ అత్యుత్తమ 50 సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (SDGs) అనుగుణంగా 17 యునైటెడ్ నేషన్స్‌పై (UN) ఆరోగ్యం మరియు సౌఖ్యత, లింగ అసమానతలను తగ్గించడం, పర్యావరణ సుస్థిరత, పరిశుద్ధమైన ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, శాంతిని నెలకొల్పడం మరియు చట్టాలపై ప్రభావం చూపించిన ప్రపంచ వ్యాప్తంగా 89 దేశాలకు చెందిన 850 సంస్థలను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2020కు పరిగణనలోకి తీసుకున్నారు.
‘‘ఆక్లాండ్ విశ్వ విద్యాలయంలోని సిబ్బంది పని తీరు ప్రపంచ-స్థాయి ఫలితాలను అందుకోవడాన్ని ప్రతిబింబించేలా చేసిన ఈ ఫలితాన్ని పొందడం తమకు గర్వకారణంగా ఉందని’’ ఆక్లాండ్ విశ్వ విద్యాలయం ఉప-కులపతి, ప్రొఫెసర్ డాన్ ఫ్రెష్‌వాటర్ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ప్రపంచం నుంచి కొవిడ్ మహమ్మారి సమస్య పూర్తిగా తొలగిపోయిన తరువాత ఎలా ఉంటుందే అంశాన్ని మేము పరిగణనలోకి తీసుకుని, ఇప్పటి ‘‘కదలిక లేని స్థితి’’ని దృష్టిలో ఉంచుకుని, రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితులను సుస్థిర విధానాల్లో మరింత బలోపేతంగా తీర్చి దిద్దేందుకు ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశాలపై ‘‘ఇంప్యాక్ట్ ర్యాంకింగ్స్’’ దృష్టి సారించిందని’’ ఆమె పేర్కొన్నారు.