బెంగళూరు–హైదరాబాద్ ఎలక్ట్రిక్ ఏసీ స్లీపర్ బస్సు సర్వీసును ప్రారంభించిన ఫ్రెష్ బస్

ఇది ఈ సంస్థ మొదటి సుదూర మార్గం,

రెండు ప్రధాన టెక్ నగరాల మధ్య అనుసంధానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది.

  • ఫ్రెష్ బస్, బెంగళూరు, హైదరాబాద్‌లను కలుపుతూ తన తొలి 600+ కి.మీ.ల సుదూర ఎలక్ట్రిక్ మార్గాన్ని ప్రారంభించింది
  • సుదూర ప్రయాణాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఈ మార్గంలో అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయి
  • ప్రయాణ మధ్యలో ఆగే స్టేషన్లలో పరిశుభ్రమైన విశ్రాంతి గదులు, సుదూర ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి

భారత్, సెప్టెంబర్ 2026: భారతదేశ ప్రముఖ ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ బస్ బ్రాండ్ అయిన ఫ్రెష్ బస్, తన
బెంగళూరు-హైదరాబాద్ మార్గాన్ని ప్రారంభించడం ద్వారా long విభాగంలోకి విస్తరిస్తోంది. ఇది దక్షిణ
భారతదేశం లోని అత్యంత రద్దీగా ఉండే ఇంటర్‌సిటీ కారిడార్లలో ఒకదానికి పూర్తిగా ఎలక్ట్రిక్, ప్రీమియం ప్రయాణ అనుభ వాన్ని అందిస్తుంది.

600 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న బెంగళూరు-హైదరాబాద్ మార్గం, ఫ్రెష్ బస్ మొట్టమొదటి long ఇంటర్‌సిటీ సర్వీస్‌. దక్షిణ భారతదేశం అంతటా విస్తరించగల ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ నెట్‌వర్క్‌ను నిర్మించాలనే
కంపెనీ ప్రణాళికలలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ మార్గంలో అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టాప్‌లు ఉంటాయి, ఇవి long ప్రయాణంలో సమర్థవంతమైన ఛార్జింగ్‌కు వీలు కల్పిస్తాయి. ఈ మార్గంలో మరియు భారతదేశంలో ఈ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించిన మొట్టమొదటి ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్ ఫ్రెష్ బస్. ఇది సుదీర్ఘ ప్రయాణాలలో ఈవీ కార్యకలాపాలను మరింత సులభతరం, సమర్థవంతంగా చేయడానికి తోడ్పడుతుంది. ప్రయాణ మధ్యలో ప్రయాణికులకు విశ్రాంతి తీసుకోవడానికి, సేదతీరడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. సాంకేతికత, ఏరోస్పేస్, విద్య, అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ సంస్కృతికి నిలయమైన భారతదేశంలోని రెండు అత్యంత చైతన్యవంతమైన నగరాలను ఈ కారిడార్ కలుపుతుంది. వ్యాపారం, విద్య, వినోదం, స్నేహితులు & కుటుంబ ప్రయాణాల ద్వారా నడిచే ఈ కారిడార్, దేశంలోనే అత్యంత ఉత్సాహభరితమైన ప్రయాణ కారిడార్లలో ఒకటిగా నిలుస్తుంది.

ఫ్రెష్ బస్ సంస్థ బెంగళూరు–హైదరాబాద్ మార్గంలో ప్రీమియం ఏసీ ఆల్-స్లీపర్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడు, ప్రతి నెలా సుమారు 18,000 మంది ప్రయాణికులకు ఈ సేవలు అందించగలదని అంచనా. ప్రారంభంలో సుమారు 80% ఆక్యుపెన్సీని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ, సేవలు పూర్తిస్థాయికి చేరేసరికి ఈ ఆక్యుపెన్సీ సుమారు 90%కి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఇది ఫ్రెష్ బస్ ఇప్పటికే నడుపుతున్నమార్గాలలో కనిపిస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉంది. ఆ మార్గాలలో బస్సులు నిలకడగా 80% నుండి 90% మధ్య ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.

ఫ్రెష్ బస్ వ్యవస్థాపకుడు,  సీఈఓ శ్రీ సుధాకర్ చిర్రా మాట్లాడుతూ, ‘‘బెంగళూరు, హైదరాబాద్‌లకు పటిష్ఠరీతిలో స్థిరమైన ప్రయాణీకుల సంఖ్య ఉంది. అందువల్ల, ఎలక్ట్రిక్ ఇంటర్ సిటీ రవాణాలో ఫ్రెష్ బస్ తదుపరి అడుగు వేయడానికి ఇది ఒక ఆదర్శవంతమైన కారిడార్. చిన్న మార్గాలు మొదలుకొని 600 కిలోమీటర్లకు పైగా ఉన్న కారిడార్‌లోకి విస్తరించడం ద్వారా, ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యం, భద్రత విషయంలో రాజీ పడకుండా నమ్మకమైన సుదూర ప్రయాణ అనుభవాన్ని అందించగలవని మేం నిరూపించగలుగుతాం. ఈ ప్రారంభంతో, సుదూర ఈవీ ప్రయాణానికి సంబంధించి దేశవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉన్న ఇతర కారిడార్లకు విస్తరించగల ఒక బలమైన ఆపరేటింగ్ మోడల్‌ను సృష్టించడమే మా లక్ష్యం” అని అన్నారు.

బెంగళూరు – హైదరాబాద్ సర్వీసును ఫ్రెష్ బస్ వారి 13.5-మీటర్ల ఆల్-స్లీపర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులతో నడప నున్నారు. వీటిలో 36 విశాలమైన స్లీపర్ బెర్త్‌లు ఉంటాయి. సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోచ్‌లలో, శుభ్రమైన, శానిటైజ్ చేసిన బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పట్లతో పాటు సౌకర్యవంతమైన ఏసీ స్లీపర్ బెర్త్‌లు, రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు, ఉచిత స్నాక్ బాక్స్, వాటర్ బాటిల్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ బస్సులలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, వేగ నియంత్రణ కార్యకలాపాలు, అత్యవసర ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయి. హ్యామర్లు, వాహనం అంతటా సీసీటీవీ కెమెరాలు, కెప్టెన్ల ఆల్కహాల్ తనిఖీ వంటి కీలక భద్రతా ఫీచర్లు అమర్చబడ్డాయి.

ఇంటర్ సిటీ బస్సు ప్రయాణం అనేది కేవలం ధరకే పరిమితం కాకుండా, సౌకర్యం, భద్రత, సమయపాలన, మొత్తం ప్రయాణ అనుభవం వంటి అంశాలు ముఖ్యమైన పరిగణనలుగా మారుతున్న తరుణంలో ఈ ఆవిష్కరణ చోటు చేసుకుంది. ముఖ్యంగా యువ, కార్పొరేట్ ప్రయాణికులలో, ఇంటర్ సిటీ ప్రయాణంలో సుస్థిరత కూడా ఒక
బలమైన అంశంగా మారుతోందని కంపెనీ భావిస్తోంది. పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సుల సముదాయంతో, ఫ్రెష్ బస్ తక్కువ శబ్దం, పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రయాణాన్ని, ప్రీమియం ఆన్‌బోర్డ్ అనుభవం, ఊహించదగిన ప్రయాణంతో కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారతదేశంలో సుదూర ఎలక్ట్రిక్ ప్రయాణం కోసం విస్తరించదగిన నమూనాను ఏర్పాటు చేస్తూ, సురక్షిత, సౌకర్యవంతమైన, ప్రీమియం ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ నెట్‌వర్క్‌ను నిర్మించాలనే ఫ్రెష్ బస్ విస్తృత ఆశయంలో
బెంగళూరు – హైదరాబాద్ మార్గం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది.

ప్రస్తుతం 13 మార్గాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, తన కార్యకలాపాల ద్వారా 25.6 లక్షల మంది ప్రయాణి కులకు సేవలు అందించిన ఫ్రెష్ బస్, ఇప్పుడు ఈ అనుభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, తన ఎలక్ట్రిక్ ఇంటర్‌ సిటీ ఉనికిని విస్తరించాలని చూస్తోంది. ఈ రెండు నగరాల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ, బెంగళూరు-హైదరాబాద్‌లను కలిపే మరిన్ని మార్గాలను ప్రవేశపెట్టాలని కూడా కంపెనీ యోచిస్తోంది. బెంగళూరు–హైదరాబాద్ సర్వీస్ టిక్కెట్లు ఫ్రెష్ బస్ యాప్, వెబ్‌సైట్, అన్ని ప్రముఖ ఓటీఏల ద్వారా బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.

ఫ్రెష్ బస్ గురించి:

ఫ్రెష్ బస్ భారతదేశపు మొట్టమొదటి ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్ బస్ బ్రాండ్. ఇది దక్షిణ భారతదేశంలోని కీలక
మార్గాలలో 100% ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. ఈ సేవ సుస్థిరత, భద్రత, బుకింగ్ నుండి గమ్యస్థానం వరకు ప్రయాణీకులకు ఒక ప్రీమియం అనుభవాన్ని అందించడం అనే మూడు సూత్రాలపై నిర్మించబడింది. ఫ్రెష్ బస్ పది లక్షలకు పైగా ప్రయాణాలను పూర్తి చేసింది, 93% సమయపాలనను పాటిస్తోంది. దీని ప్రయాణీకులలో దాదాపు సగం మంది ప్రతి నెలా తిరిగి వస్తుంటారు. ఇది అన్ని OTA ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధిక రేటింగ్ పొందిన ఇంటర్‌సిటీ బస్ బ్రాండ్. 4.6+ సగటు రేటింగ్‌తో, ఇది తన ప్రధాన పోటీదారులందరినీ అధిగమించింది.
ఈ కంపెనీని సుధాకర్ రెడ్డి చిర్రా స్థాపించారు. ఈయన గతంలో అభిబస్‌ను భారతదేశపు రెండవ అతిపెద్ద బస్
OTAగా నిర్మించి, 2021లో దానిని ఇక్సిగోలో విలీనం చేశారు. ఫ్రెష్ బస్‌కు మణివ్ మొబిలిటీ, షెల్ వెంచర్స్, రివర్‌వాక్ హోల్డింగ్స్, ఇక్సిగో వంటి ప్రముఖ ఇన్వెస్టర్లు మద్దతు ఇస్తున్నారు. 18 మార్గాలలో 100కి పైగా బస్సులను నడుపుతూ, ఈ కంపెనీ తన నమూనాను నిరూపించుకుంది మరియు ఇప్పుడు విస్తరిస్తోంది.