భారత్‌లో లాక్‌డౌన్‌ బాగా దెబ్బతీసింది: అమెజాన్

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో లాక్‌డౌన్ వల్లే తాము ఆర్థికంగా బాగా నష్టపోయామని అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ శుక్రవారం … Read More

లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్ నెలలో కార్ల జీరోసేల్స్: మారుతీ సుజుకీ

లాక్‌డౌన్ వల్ల మారుతీ సుజుకీ కార్ల కంపెనీ ఏప్రిల్ నెలలో జీరోసేల్స్ తో కంపెనీ వెనుకబడింది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలోమారుతీ సుజుకీలో మార్చి 22వతేదీ నుంచి కార్ల విక్రయాలు, ఉత్పత్తిని నిలిపివేశాయి. కరోనా ప్రభావం కార్ల కంపెనీలపై తీవ్ర ప్రభావం … Read More

భారత్‌లో 40 వేలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 40 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 83 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య … Read More

తెలంగాణలో ఇవాళ 21 కరోనా కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 21 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 20 కేసులు నమోదవగా.. జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడి 29 మంది ప్రాణాలు … Read More

తెలంగాణా రాష్ట్రంలో కోవిడ్ -19 పై ఆరోగ్య ప్రచారం ప్రారంభించిన టాటా ట్రస్ట్స్

వీడియో, ఆడియోల ద్వారా విస్తృత అవగాహన  కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం సూచించిన ఆరోగ్య విధానాలను ప్రజలు పాటించేలా వారిని ప్రోత్సహించేందుకు టాటా ట్రస్ట్స్‌ వారు అవగాహన చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం టాటా వారు కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాన్ని మార్చి31న ప్రారంభించింది. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య విధానాల పట్ల వారిని విద్యావంతులను చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు వివిధ ఆడియో, వీడియో, యానిమేషన్‌ల ద్వారా ప్రచార చర్యలు చేపట్టింది. ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఆసక్తి కలిగిన సంస్థలకు 300లకుపైగా వీడియోలు, ఆడియోల ద్వారా సందేశాలను సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉంచినట్టు టాటా ట్రస్ట్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి తెలుగు సహా పలు భాషలలో కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేగాక ఇవి ప్లేలిస్టులో కూడా అభ్యమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ‘కదం, కరోనా ముక్త్‌ జీవన్‌’ పేరుతో వీడిమో సందేశాలు, లఘు యానిమేషన్‌ వీడియోలతో పాటు ఇన్ఫో గ్రాఫిక్స్‌ మొదలైన ఆడియో సందేశాలు, ఎస్‌ఎంఎస్‌ ఆధారిత సందేశాల ద్వారా అందుబాటులో ఉంచినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేగాక వీరికి మద్దతుగా సుప్రసిద్ద గాయకులు రఘు కుంచే, పార్థసారథి నేమానీలు కూడా వీడియో ద్వారా సామాజిక దూరం పట్ల, శుభ్రత పట్ల తమ సందేశాన్ని అందించారు. కరోనాపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు టాటా ట్రస్ట్స్‌ వారే ఇప్పుడు నలుగురు మాస్టర్‌ ట్రైనర్లను నియమించింది. వీరు 50పైగా కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్‌(గ్రామ వాలంటీర్ల)కు శిక్షణ అందించడం ద్వారా ఈ సందేశం చివరి వరకూ చేరేలా వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. ట్రస్ట్‌ కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుత నెట్‌వర్క్‌తో పాటుగా, ట్రస్ట్స్‌ వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలు, కమ్యూనిటీ రెడియోలు, గ్రామ అధారిత పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్స్‌, ఇంటర్నేట్‌, కమ్యూనికేషన్‌ సాంకేతికతల వినియోగం ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు.  ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయబడుతున్న ఆరోగ్య విధానాలు: చేతులు శుభ్రంగా కడగడంలో నైపుణ్యం. భౌతిక దూరం అవశ్యకత. శ్వాస సంబంధిత పద్ధతులు. సరైన సమాచారంపై ఆధారపడటం. కోవిడ్‌-19 లక్షణాలను ముందుగా గుర్తించడం. తిరిగి వచఇన వలస కార్మికులు స్వీయ నిర్భందం కోసం మార్గదర్శకాలను అనుసరించేలా చేయడం.

హైదరాబాద్ లో పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు

కరోనా కంటిమీది కునుకులేకండా చేస్తుంది. హమ్మయ్య అనుకుంటున్నా సమయంలో మరిన్ని కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అక్కడక్కడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మరో ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు … Read More

పెరిగిన మద్యం ధరలు

లాక్ డౌన్ వల్ల ప్రజల బాధలను అర్ధం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేసుకోవచ్చు అంటూ కొన్ని సడలింపులు ఇచ్చింది. ఏది ఎంత మేరకు ఫలిస్తుందో తెలియదు కానీ ఏపీలో మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తుంది. రాష్ట్రంలో మద్యం … Read More

రాంకోఠిలో కరోనా కలకలం

సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధి రాంకోటిలో ఓ 57 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అక్కడ కలకలం రేగింది. ఇటీవల మెదక్ లో అతని కూతురు బంధువుల పెళ్లికి హాజరైన సమాచారం. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న … Read More

కరోనా మహమ్మారి సహజసిద్ధంగానే వచ్చింది

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సహజసిద్ధంగానే ఉద్భవించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పునరుద్ఘాటించింది. చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే వైరస్‌ వచ్చిందన్న ట్రంప్‌ ఆరోపణలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ ఎలాంటి జీవుల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందో … Read More

అమెరికాలోని విదేశీయులకు గుడ్ న్యూస్

అమెరికాలోని విదేశీయులకు ట్రంప్ శుభవార్త చెప్పారు. హెచ్-1బీ వీసాదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దు అని తెలిపారు. కరోనా వైరస్ అమెరికాలో కోలుకోలేని దెబ్బ తీసింది. వైరస్ విషయంలో చైనా మీద ప్రత్యక్ష ఆరోపణలు చేసిన ట్రంప్…దేశంలో కరోనని కట్టడి చేయడానికి సరైన … Read More