అమెరికాలోని విదేశీయులకు గుడ్ న్యూస్
అమెరికాలోని విదేశీయులకు ట్రంప్ శుభవార్త చెప్పారు. హెచ్-1బీ వీసాదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దు అని తెలిపారు. కరోనా వైరస్ అమెరికాలో కోలుకోలేని దెబ్బ తీసింది. వైరస్ విషయంలో చైనా మీద ప్రత్యక్ష ఆరోపణలు చేసిన ట్రంప్…దేశంలో కరోనని కట్టడి చేయడానికి సరైన నిర్ణయాలు తిసుకేయలేదని విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే అమెరికాలో స్థిరపడిన విదేశీయుల మద్దతు మాత్రం తీసుకున్నాడు అనే చెప్పాలి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. హెచ్-1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు సంబంధిత పత్రాలను సమర్పించాలంటూ నోటీసుల జారీ చేసిన యుఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుభవార్త అందించింది. అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో రెండు నెలలపాటు ఇమ్మిగ్రేషన్ ను ఇటీవల నిలిపివేయడంతో గ్రీన్ కార్డు కార్డు కోసం ఎదురు చూస్తున్నవారికి రెండు నెలల సమయం దొరికింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా, వీరిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు.
శుక్రవారం నాటి యుఎస్‌సీఐఎస్ ఉత్తర్వుల ప్రకారం హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు కొనసాగింపు వీసా(ఎన్-14), తిరస్కరించే నోటీసులు, ఉపసంహరించుకునే నోటీసు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు, ఫారం ఐ-290బీ నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించిన వాటిని 60 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. అభ్యర్థనలు, నోటీసుల విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందు 60 రోజులలోగా స్పందించాలని తెలిపింది. గడువు ముగిసిన వారిపై ఏదైనా చర్య తీసుకునే ముందు నిర్ణీత తేదీ నుండి 60 క్యాలెండర్ రోజుల వరకు అందుకున్న ఫారం ఐ-290బీ ను పరిశీలిస్తామని యుఎస్‌సీఐఎస్ తెలిపింది.
కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటామని ఏప్రిల్ 10న ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని అంచనా వేసిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంటామని భారత ప్రభుత్వం సూచించిన కొద్ది రోజుల తరువాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.