హైదరాబాద్ లో పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు

కరోనా కంటిమీది కునుకులేకండా చేస్తుంది. హమ్మయ్య అనుకుంటున్నా సమయంలో మరిన్ని కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అక్కడక్కడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మరో ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. వనస్థలిపురం 8 కాలనీల్లో కంటైన్మెంట్‌ జోన్లుగా అధికారులు గుర్తించారు. కంటైన్మెంట్‌ జోన్లలో రేపటి నుంచి రాకపోకలు వారం రోజుల పాటు నిషేదించారు. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలోని నివాసపరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు. హుడాసాయినగర్‌, కమలానగర్‌, రైతుబజార్‌ సమీపంలో ఎ.బీటైప్‌ కాలనీ, ఫేజ్‌ 1 కాలనీ, సచివాలయం నగర్‌, ఎస్‌కేడీ నగర్‌, రైతుబజార్‌ సాహెబ్‌నగర్‌లను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. వనస్థలిపురం పరిధిలో ఇప్పటి వరకు 9 కేసుల నమోదయ్యాయి. 169 కుటుంబాలు హోంక్వారంటైన్‌లో ఉన్నాయి.