కరోనా మహమ్మారి సహజసిద్ధంగానే వచ్చింది

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సహజసిద్ధంగానే ఉద్భవించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పునరుద్ఘాటించింది. చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే వైరస్‌ వచ్చిందన్న ట్రంప్‌ ఆరోపణలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ ఎలాంటి జీవుల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందో తెలుసుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. తద్వారా భవిష్యత్తులో వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.