రూ. 100కే భగీరథ నల్లా కనెక్షన్
హైదరాబాద్: పట్టణాల్లో నల్లా కనెక్షన్ పొందేందుకు చెల్లించాల్సిన ధరావతు సొమ్మును ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రూ.100కే కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ విధానాన్ని యథాతథంగా కొనసాగించనున్నారు. దీనికి సంబం
ధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సంతకం చేశారు. ఇప్పటి వరకు పట్టణాల్లో ఏపీఎల్ కుటుంబాలు కనెక్షన్ పొందాలంటే రూ.6 వేల ధరావతు, ఇంటిలోపల నల్లా పెట్టుకోవడానికి రూ.10,500లు చెల్లించాల్సి వస్తోంది. ఇంత పెద్దమొత్తంలో రుసుం ఉండంటంతో నల్లా కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని భావించిన సీఎం ధరావతును పూర్తిగా తగ్గించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలంతా శుద్ధి చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంకా ఏమన్నారంటే..
సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సంతకం చేశారు. ఇప్పటి వరకు పట్టణాల్లో ఏపీఎల్ కుటుంబాలు కనెక్షన్ పొందాలంటే రూ.6 వేల ధరావతు, ఇంటిలోపల నల్లా పెట్టుకోవడానికి రూ.10,500లు చెల్లించాల్సి వస్తోంది. ఇంత పెద్దమొత్తంలో రుసుం ఉండంటంతో నల్లా కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని భావించిన సీఎం ధరావతును పూర్తిగా తగ్గించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలంతా శుద్ధి చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంకా ఏమన్నారంటే..
మంచినీరు పొందే హక్కు
మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షితమైన మంచినీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లా ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తోంది. అందరూ కనెక్షన్ పొందాలంటే ధరావతును నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే శుద్ధిచేసిన నీటిని అందరూ తాగాలని కోరుకుంటున్నాను.

పది లక్షల ఇళ్లకు కనెక్షన్లు
రాష్ట్రంలోని పురపాలికలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల గృహాలకు నల్లాలు బిగించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 1.20 లక్షల గృహాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. ధరావతు ఎక్కువగా ఉండటంతో మిగిలిన ఇంటి యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో 6.7 లక్షల గృహాలకు కనెక్షన్లు అందుబాటులోలేవు. వీటికి తోడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల గృహాలకు కనెక్షన్లు అందించాల్సి ఉంది. అన్నీ కలిపి పట్టణాల్లో పది లక్షల గృహాలకు ఇవ్వాలి. కనెక్షన్ పొందాలంటే ధరావతు ఎక్కువగా ఉన్నందున వారంతా తీసుకునేందుకు ముందుకురారు. దీనివల్ల ప్రజలందరికీ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరదు. అందుకే ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ మంచినీటి నల్లా కనెక్షన్ కోసం చెల్లించాల్సిన ధరావతును నామమాత్రం చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.