మేడారం జాతర అభివృద్ధికి 150కోట్లు

ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు, ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించడానికి మేడారంకు తరలివస్తుంటారు. ముఖ్యంగా వారాంతాలు, సెలవుదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేడారం ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా మేడారంలో పర్యటించనున్నారు. మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై పూజారులు, ఆదివాసీ నేతలు, గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. ఇప్పటికే సోమవారం ఆయన కార్యాలయంలో అధికారులు, మంత్రులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఏమిటంటే ప్రతి నిర్మాణం ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలనేది. ఈ క్రమంలో గ్రానైట్, లైమ్‌స్టోన్ వంటి సహజ పదార్థాలను వినియోగించాలని నిర్ణయించారు. స్థపతి ఈమని శివనాగిరెడ్డి మార్గదర్శకత్వంలో పనులు సాగనున్నాయి.గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడం, ద్వారాల సంఖ్య పెంచడం, భారీ స్వాగత తోరణాల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ప్రత్యేకంగా తోరణాల ఎత్తు 40 అడుగుల వరకు పెంచాలని యోచిస్తున్నారు. భక్తుల రద్దీ సమయంలో తోపులాటలు జరగకుండా క్యూలైన్లను బలపరుస్తారు. గద్దెల చుట్టూ ర్యాంపులు, ఎత్తైన ప్రదేశాలు నిర్మించి భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. రూ.150 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక వచ్చే ఏడాది జనవరి చివర్లో జరగబోయే మహా జాతర దృష్ట్యా ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. అందులో రూ.91 కోట్లు రోడ్ల విస్తరణ, వంతెనలు, కాలువల నిర్మాణానికి వినియోగించనున్నారు. మిగిలిన నిధులతో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలు, భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతులు కల్పించనున్నారు.

విదేశాలకు వెళ్లే వారిలో అమ్మాయిలే అధికం

ఉన్న‌త‌విద్య కోసం విదేశాల‌కు వెళ్ల‌డం విద్యార్థులంద‌రికీ ఓ క‌ల‌. ఈ క‌ల‌ను సాకారం చేసుకోవ‌డంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజ‌లో ఉంటున్నారు. గ‌త సంవ‌త్స‌రం భార‌త‌దేశం నుంచి అమెరికాకు రికార్డు స్థాయిలో 82,500 ఎఫ్‌1 (విద్యార్థి) వీసాలు వ‌స్తే, అందులో అత్య‌ధికులు … Read More

రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు

నూతన సంవత్సరం సందర్భంగా, డిసెంబర్ 31 రోజున రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రాత్రి 1 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ఎక్సైజ్ & CT స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ … Read More

హెటెరోలాగస్ బూస్టర్ షాట్‌గా మెరుగైన రోగనిరోధక శక్తిని అందించనున్న CORBEVAX

భారతదేశానికి, కోవిడ్-19 వ్యాప్తిని మరియు దాని వేరియేషన్లను తగ్గించడంలో హెటెరోలాగస్ బూస్టర్ షాట్‌లు తదుపరి దశ ప్రయోజనాలను అందిస్తాయి   వ్యాక్సిన్ మోతాదుల ప్రభావం క్షీణిస్తున్న నేపథ్యంలో హెటెరోలాగస్ బూస్టర్ షాట్‌లు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, ప్రత్యేకించి వైరస్ యొక్క వివిధ వైవిధ్యాలకు వ్యతిరేకంగా, … Read More

MG మోటార్ ఇండియా అత్తాపూర్‌లో
సరికొత్త సర్వీస్ సెంటర్ ప్రారంభించింది

MG మోటార్ ఇండియా, దేశవ్యాప్తంగా కార్ సర్వీస్ అనుభవాన్ని పూర్తిగా పునర్నిర్వచించాలనే దాని నిబద్ధతను నొక్కి చెబుతూ, తెలంగాణలోని అత్తాపూర్‌లో కొత్త సర్వీస్ సెంటర్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్ ను ప్రకటించింది. నగరం అంతటా ఎక్కువ మంది కస్టమర్‌ల యొక్క అభివృద్ధి … Read More

1,00,000 మైలురాయిని చేరుకున్న MG మోటార్ ఇండియా

ఆవిష్కరణలు, కమ్యూనిటీ, వైవిధ్యం మరియు అనుభవాలు అనే బ్రాండ్ పిల్లర్లతో కేవలం కార్లు కాకుండా వాటికి మించిన వైవిధ్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉంది MG మోటార్ ఇండియా భారతదేశంలోని 1,00,000 సంతోషకరమైన కుటుంబాలలో భాగమైందని ప్రకటించింది. స్థిరమైన ఆవిష్కరణలు, అనుభవపూర్వక కస్టమర్ … Read More

పేటీఎం మనీ LIC IPOని రిటైల్ స్టోర్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది

పెట్టుబడిని సామాన్యులకు అందుబాటులో ఉంచడంలో భాగంగా ఉచిత డీమ్యాట్ ఖాతాల కోసం QR కోడ్‌లను ఉంచుతుంది భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక సేవల సంస్థ అయిన పేటీఎం బ్రాండ్‌ను కలిగి ఉన్న One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఈరోజు తన … Read More

ఇన్‌ఫినిక్స్ HOT 11 2022

ఇన్‌ఫినిక్స్ దాని ఆల్-రౌండర్ బడ్జెట్-ఫ్రెండ్లీ సిరీస్‌ లేటెస్ట్ మోడల్ ను ప్రవేశపెట్టడంలో భాగంగా, ఫాస్ట్ & ఫన్ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించే HOT 11 2022ని విడుదల చేసిందిHOT 11 2022 అదనపు కొత్త ఫీచర్లు, రిఫ్రెష్ డిజైన్ మరియు మెరుగైన … Read More

ట్రూక్, బ్రాండ్ అంబాసిడర్‌ గా మృణాల్ ఠాకూర్‌

ఆమె పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, సెలబ్రిటీ యూత్ ఐకాన్ బ్రాండ్ కోసం అన్ని TWS ఉత్పత్తులను ఆమోదించిందిబ్రాండ్ తన రాబోయే TWS బడ్స్, S2ని వచ్చే వారం విడుదల చేయడానికి అన్నింటిని సిద్ధం చేసింది ట్రూక్, భారతదేశంలో అత్యంత వేగంగా … Read More

తాను చదివిన కాలేజీ కోసం వంద కోట్ల విరాళం: రాకేష్ గంగ్వాల్

ఇండిగోతో ఆకాశంలో ఎగరడమే కాదు, అంత కన్నా మిన్నగా తాను చదివిన ఐఐటీ కాన్పూర్ లో మెడికల్ ఇంజనీరింగ్ కోర్స్ మొదలుపెట్టడానికి 100 కోట్లు ఇచ్చి చేయూత నిచ్చిన దాన కర్ణుడు. రాకేష్ గంగ్వాల్ @IndiGo6E @IITKanpur