30 నెలల ‘నో-కాస్ట్ EMI’ ప్లాన్‌తోఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసిన శాంసంగ్
- 30 నెలల ‘నో-కాస్ట్ ఈఎంఐ‘తో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను శాంసంగ్ మరింత అందుబాటు లోకి తీసుకువచ్చింది.
- గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా ధర నెలకు కేవలం ₹6,667 నుండి ప్రారంభమవుతుంది; ఇది గెలాక్సీ Z ఫోల్డ్ 7తో పోలిస్తే 9% తక్కువ నెలవారీ ఈఎంఐ.
- అనుకూలమైన 30 నెలల ఫైనాన్స్ ప్లాన్‌ల ద్వారా గెలాక్సీ Z ఫోల్డ్ 8 ధర నెలకు కేవలం ₹6,000 నుండి మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 8 ధర నెలకు ₹4,167 నుండి ప్రారంభమవుతాయి.
గురుగ్రామ్ – ఇండియా 2026 – శాంసంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ ఆవిష్కరణలను మరింత సులభం గా అందుబాటులోకి తెస్తూ, గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్8, గెలాక్సీ Z ఫ్లిప్8 కోసం 30 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్‌లను ప్రారంభించడం ద్వారా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ యాజమాన్యాన్ని పునర్నిర్వచిస్తోంది. నెలవారీ యాజమాన్య అవరోధాన్ని తగ్గించడానికి రూపొందించబడిన ఈ కొత్త ఫైనాన్సింగ్ ఆప్షన్, గెలాక్సీ ఏఐతో పనిచేసే శాంసంగ్ తాజా గెలాక్సీ Z సిరీస్‌ను జీరో డౌన్ పేమెంట్‌తో ఎక్కువ మంది వినియోగదారులు అనుభవిం చడానికి వీలు కల్పిస్తుంది.
ఏడు తరాల ఫోల్డబుల్ ఆవిష్కరణలు, వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌పై నిర్మించబడిన శాంసంగ్ తాజా గెలాక్సీ Z సిరీస్, ప్రత్యేకంగా రూపొందించిన గెలాక్సీ ఏఐని హింజ్ డిజైన్, డిస్‌ప్లే, మన్నిక, పని తీరులో అద్భుతమైన ఇంజ నీరింగ్‌తో కలపడం ద్వారా ఇప్పటివరకు అత్యంత అధునాతనమైన ఫోల్డబుల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కొత్త ఫైనాన్సింగ్ ప్రతిపాదన, శాంసంగ్ తాజా ఫోల్డబుల్ అనుభవాలను మరింత సులభంగా సొంతం చేసుకునేలా చేయడం ద్వారా ఈ ఆవిష్కరణను పరికరానికి మించి విస్తరింపజేస్తోంది.
వినియోగదారులు ఇప్పుడు గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రాను నెలకు కేవలం రూ. 6667 నుండి ప్రారంభమయ్యే ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు; ఇది మునుపటి తరం గెలాక్సీ Z ఫోల్డ్7 కంటే 9% తక్కువ. గెలాక్సీ Z ఫోల్డ్8 నెలకు రూ. 6000 నుండి అందుబాటులో ఉండగా, గెలాక్సీ Z ఫ్లిప్8 కేవలం నెలకు రూ. 4167 నుండి ప్రారంభ మవుతుంది. దీనితో అత్యాధునిక ఫోల్డబుల్ టెక్నాలజీ మరింత ఎక్కువ మంది వినియోగదారులకు అందు బాటు లోకి వస్తుంది.
30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం శాంసంగ్ ఫైనాన్స్+ (డీఎంఐ ఫైనాన్స్ ద్వారా అందించబడుతుంది), టీవీఎస్ క్రెడిట్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పూనావాలా ఫిన్‌కార్ప్ ద్వారా అందుబాటులో ఉంది. ఇది శాంసంగ్ సరి కొత్త ఫోల్డబుల్ ఆవిష్కరణలను సొంతం చేసుకోవడానికి వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది.
30 నెలల తిరిగి చెల్లింపు కాలపరిమితి, కస్టమర్లు యాజమాన్య ఖర్చును ఎక్కువ కాలం పాటు విస్తరించుకోవ డానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల గెలాక్సీ ఏఐ ఆవిష్కరణలు, ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ పనితీరును ఆస్వాది స్తూనే, ప్రీమియం ఫోల్డబుల్ టెక్నాలజీని సొంతం చేసుకోవడం సులభతరం అవుతుంది.
| నమూనా | EMI రకం మరియు కాలవ్యవధి | గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రా 256GB | గెలాక్సీ Z ఫోల్డ్8 256GB | గెలాక్సీ Z ఫ్లిప్8 256GB |
| ఎమ్మార్పీ | ₹1,99,999 | ₹1,79,999 | ₹1,24,999 | |
| నెలవారీ వాయిదా | 30 నెలల NBFC ఈఎంఐ | ₹6,667* | ₹ 6000* | ₹4,167* |
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి









