కళ్యాణ లక్ష్మీ అందుకే ఇస్తున్నారు : తిరుపతి యాదవ్
తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డల కు అండగా ఉంటున్నది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా వారి వివాహాలకు లక్షనూట పద హార్లు అందజేస్తున్నది. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడానికే ఈ పథకం తీసుకవచ్చారని తెరాస రాష్ట్ర యువ నాయకులు తిరుపతి యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్కులు పంపిణీ చేసిందకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అభినందనలు తెలిపారు. కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఆడబిడ్డల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్దదిక్కు అయ్యారని, ఆయన మేలు మరవబో మని స్పష్టంచేశారు.











