మీరు దాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ హీట్ చేస్తున్నారా ?

మీరు దాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ హీట్ చేసి వాడుతున్నారా అయితే మీకు ఖ‌చ్చితంగా ఆరోగ్య స‌మ‌స్య‌లు తల‌‌త్తేడం ఖాయ‌మంటున్నారు డాక్ట‌ర్ స్ర‌వంతి. మ‌నం నిత్యం ఇంట్లో వండుకునే కూర‌లు రాత్రి వ‌ర‌కు చ‌ల్లారిపోతాయి. దీంతో రాత్రి భోజ‌నంలోకి మ‌ళ్లీ వాటిని వేడి చేసుకొని తింటుంటారు. అయితే దీని వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయని తెలిపారు. అవే ఏంటో చూద్దాం.

చికెన్:
చికెన్ నుంచి ఆపార‌మైన శ‌క్తి మ‌న శ‌రీరంలోకి వ‌స్తుంది దీన్ని అదే ప‌నిగా వేడి చేసుకొని తిన‌వ‌ద్దు. దీని వ‌ల్ల ప్రోటీన్లు అంద‌వు. సైడ్ డిష్‌గా ఉప‌యోగించాలి. పొట్ట‌నొప్పి వ‌చ్చే అవ‌కాశం ఉంది.
పాల‌కూర :
దీని వ‌ల్ల అనేక ర‌కాల ప్రోటీన్లు ల‌భిస్తాయి. అంతేకాకుండా ఆకుకూర‌లు తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఉద‌యం వండిన త‌ర్వాత రాత్రి మ‌ళ్లీ వేడి చేసుకొని తిన‌వ‌ద్దు. దీని వ‌ల్ల అన్నం స‌రిగా అర‌గ‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.
ఆలుగ‌డ్డ :
ఆలుగ‌డ్డ ద్వారా అనే పోష‌కాలు మ‌న‌కు అందుతాయి. దీని వ‌ల్ల మ‌నిషికి చాలా ఉప‌యోగాలు ఉంటాయి. దీన్ని కూడా ప‌లుమార్లు వేడి చేయ‌డం వ‌ల్ల పోష‌కాలు త‌గ్గిపోయి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. బోటలిజం అనే బ్యాక్టీరీయా వ‌స్తుంది.
అన్నం :
అన్నంని అస‌లు వేడి చేయ‌వ‌ద్దు. దీని వ‌ల్ల ఆహారం అరిగకుండా శ‌రీర స‌మ‌స్య‌లు వ‌స్తాయి
బీట్‌రూట్ :
పాల‌కూర లాగే అనేక ర‌కాలైన పోష‌కాలు దీంట్లో ఉంటాయి. వీటిని కూడా వేడి చేసుకొని తింటే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు వ‌స్తాయి.
నూనే :
ముఖ్యంగా నూనెను సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌క్కువ‌గా ఉప‌యోగించుకోవాలి. ఎక్కువ‌గా ఉందని ప‌దే ప‌దే వేడి చేసి ఉప‌యోగిస్తే అనేక స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడుతాయి. ‌

ఇంకా మ‌రిన్ని చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి. https://www.youtube.com/channel/UCGO4mWLb71e5fQ_kuo76I6A