అమెరికాలో ఇక మాస్క్ లేకుండా తిరగొచ్చు
ప్రపంచాన్ని గడగడలాండిన కరోనా వైరస్‌ను అమెరికా అదుపులో పెట్టింది. కరోనా వ్యాధి మొదలైనప్పటి నుండి కరచలనాలు, హగ్స్ పులిస్టాప్ పెట్టేశారు. గత రెండు సంవత్సరాలు పెద్దగా ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయలేదు. అయితే అమెరికా దేశం ఈ విషయంలో ముందడుగు వేసిందని చెప్పుకోవాలి. శ్వేత సౌదంలో మాస్క్‌లు, ఆరుడుగల దూరం పాటించకుండా కార్యకాలపాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ వెల్లడించారు. అధికారులు, రిపోర్టలు కూడా పెద్ద ఎత్తున ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా రెండు టీకా డోసులు వేసుకున్న వారు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశ అంటువ్యాధుల నివారణ కేంద్రం తెలిపింది.