రైతులను మోసం చేస్తున్న ఐకేపీ ఏజెంట్లు
- ఐకేపీ సెంటర్ల వద్ద ఏజెంట్ల కమీషన్ దందా
గత ప్రభుత్వల హయంలో రైతులు మోసపోయారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఇబ్బందులు ఉండవద్దని ముఖ్యమంత్రి ప్రతి గ్రామాన ఐకేసీ సెంటర్లను ఏర్పాటు చేశారు. స్వయంగా రైతు వద్ద నుండి ప్రభుత్వమే వడ్లను కొనుగొలు చేస్తోంది. ఈ కార్యక్రామాన్ని సమర్థవంతంగా నడిపించడానికి ప్రతి గ్రామంలో చదువుకున్న యువకులను ఏజెంట్‌గా నియమించింది. దీంతో సాపీ సాగుతున్న ఈ కొనుగొలు వ్యవస్థలో ఏజెంట్ల, అక్కడ వారిని నియమించిన వారికి పుట్టిన దుర్భుద్ది వల్ల రైతును మోసం చేస్తున్నారు. దళారుల చేతుల మేసపొవద్దని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐకేపీ సెంటర్ల వద్ద కాపు కాసిన గద్దల్లా… కోళ్లను మింగినట్టు మింగేస్తున్నారు. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్న భిక్షవాళ్ల లాగా రైతులను దోచుకుంటున్నారు.
ఆరుకాలం ఎండఅనక, వాననక కష్టపడి పండిస్తే… తరుగు తీసేస్తున్నారు. ఆ తరుగు తీసిన వడ్లను, అక్కడ యాజమాయిషి చేలాయిస్తున్న వ్యక్తి ఆ వడ్లను సగం ధరకు కొని అదే ఐకేపీ సెంటర్ ఏజెంట్ ప్రభుత్వ ధరకు అమ్ముతున్నారు.
మరోవైపు హామాలీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు కాకుండా అదనంగా సంచికి 1 రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది చాలకుండా వడ్లు లారీలోకి లోడ్ చేసినప్పుడు అక్కడా కూడా బస్తాకు రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక లారీలో దాదాపు 700 వందల బస్తాలు నింపితే అందులో హామాలీలకు 300 ఇచ్చి మిగిత డబ్బులను ఏజెంట్ తన జేబులో వేసుకుంటున్నారు. ఇక్కడ కష్టపడుతున్న రైతుకు న్యాయం జరగడం లేదు అలాగే ఐకేపీ సెంటర్ వద్ద బస్తాలు మోస్తున్న హామాలికీ న్యాయం జరగడం లేదు. రైతుల పొట్టకొట్టి ఏజెంట్లు లాభపడుతున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ధరిపల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఐకేసీ సెంటర్ల వద్ద ఏజెంట్లు ప్రభుత్వ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతు పొట్ట మీద కొడితే… రాజ్యం బాగుపడదని దీని వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. చదువుకున్న వారే ఇలా చేస్తే… అది సొంత ఊరిలో నిత్యం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వారిని ఎలా మోసం చేయాలనపిస్తుందని ప్రశ్నించారు. తక్షణమే మెదక్ జిల్లా కలెక్టర్ బాధ్యతగా ఏజెంట్లపై విచారణ చేపట్టి కఠిర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.