గార్డ్‌తో వివాహేతర సంబంధం చివరకి
వివాహేతర సంబంధం మానవత్వాన్ని మంట కలిపింది. కడ దాక తోడుంటాడని చెప్పిన భర్తే కాటేశాడు. భార్య మనసులో పుట్టిన నీచమైన కోరిక చివరకి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే చెన్నై రెడ్‌హిల్స్, గాంధీనగర్‌కు చెందిన నారాయణన్ (40) కట్టడ కార్మికుడు. భార్య మోహన (36). ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డు దాస్‌తో మోహనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం సాయంత్రం మోహన, దాస్ మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన దాస్ ఇంటి తలుపులు మూసి వేగంగా బయలుదేరాడు. అతను ఆక్రోశంతో వెళ్లడం చూసిన ఇరుగుపొరుగువారు అనుమానంతో చోళవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి లోనికి వెళ్లగా చీరతో గొంతు బిగించిన స్థితిలో మోహన హత్యకు గురైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దాస్ కోసం గాలిస్తున్నారు.