ఫ్రాన్స్‌లో మళ్లీ దేశావ్యాస్తంగా లాక్‌డౌన్, 700 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
కరోనా వైరస్ ప్రాన్స్ దేశాన్ని కంటి మీదు కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కరోన వల్ల దేశ వ్యాప్తంగా లౌక్‌డౌన్ విధించి గత కొన్ని రోజుల క్రితం సడలించింది. అయితే కరోనా వైరస్ మళ్లీ విజృంభణ చేస్తుడడంతో మళ్లీ దేశ వ్యాప్తంగా లౌక్ డౌన్ విధించి ప్రాన్స్. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన వీధులు జన సంచారం లేక బోసిపోయాయి. కాగా లాక్‌డౌన్‌కు ముందుకు ఆ దేశ ప్రజలు గురువారం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. దీంతో నిత్యవసర వస్తువుల షాపులు, మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మరోవైపు దేశ రాజధాని పారిస్ నుంచి పెద్ద సంఖ్యలో ఇతర నగరాలకు తరలివెళ్లారు. దీంతో సుమారు 700 కిలోమీటర్ల మేర రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. లాక్‌డౌన్ కాలంలో నగరంలోని ఇండ్లలో ఉండలేక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు కొందరు తెలిపారు.
ఫ్రాన్స్‌లో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 13.3 లక్షలు దాటగా 36 వేల మందికిపైగా మరణించారు. మరోవైపు నిత్యం సగటున కొత్తగా 50 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. జనాభాతో పోల్చితే అమెరికా కన్నా రెండు రెట్ల మేర వైరస్ వ్యాప్తిస్తున్నది. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ఆదేశించారు. శుక్రవారం నుంచి డిసెంబర్ 1 వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని సూచించారు. కాగా రెండో విడత దేశవ్యాప్త లాక్‌డౌన్ కాలంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. కిలోమీటరు పరిధిలో గంట పాటు వ్యాయామం, ఆసుపత్రులకు వెళ్లేందుకు, పని కోసం, నిత్యవసరాల కొనుగోళ్లకు మాత్రమే అనుమతిస్తారు. కేఫ్‌లు, రెస్టారెంట్లతోపాటు మిగతా అన్నింటిని మూసివేశారు. స్నేహితుల ఇండ్లకు వెళ్లడం, అతిథిలను ఆహ్వానించడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.