సిగ్గులేని గులాబీ స‌ర్కార్ : జ‌య‌సార‌ధి రెడ్డి

రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమాత్రం సిగ్గు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని విమ‌ర్శించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి. శాంతియుతంగా పాద‌యాత్ర చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఆయ‌న‌. ప్ర‌భుత్వ చేతాకాని త‌నం వ‌ల్లే అరెస్ట్‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. యాదాద్రి జిల్లా నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల చేస్తున్న‌ పాద‌యాత్ర‌లో ఆయ‌న పాల్గొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.