అందుకే ఆ రోడ్లు వేస్తున్నాం: ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా. డెక్కన్‌న్యూస్ ప్ర‌తినిధి, సయ్యద్ ఖమర్‌ :
గ్రామాలు అభివృద్ధి చెందిన‌ప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి బాట‌లో ప‌య‌నిస్తుంద‌న్నారు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ‌, అట‌వీశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి. ఇచ్చోడ మండలం లో రఘు గూడా నుండి మూకురా కే మీదుగా గేరిజం వరకు బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన మరియు నూతనంగా నిర్మించిన చెక్ డ్యాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయ‌న పాల్గొన్నారు. ర‌వాణా సౌల‌భ్యం కొరుకు ర‌హాదారులు నిర్మాణం చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మండల కన్వీనర్ పాట్కూరి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మీనాక్షి, ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఎంపీటీసీ సుభాష్ ఏఎంసీ చైర్మన్ అశ్విత రాథోడ్, సీనియర్ నాయకులు ఏనుగు కృష్ణారెడ్డి, ఎంపిటిసి తిరుమల వెంకటేష్, డీసీఎంస్ డైరెక్టర్ సురేష్ దూకేరే, సర్పంచ్ సుభాష్ పటేల్, రామ్ చందర్ ప్రకాష్ రాథోడ్, అజీమ్ ప్రవీణ్, ఆనంద్, మొహమ్మద్ జుమ్మా, బి పి ఆర్ మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు