విజయ్ సేల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాహుల్ ద్రవిడ్
క్రికెట్ దిగ్గజం ఏడాది పొడవునా టెలివిజన్, డిజిటల్, ఇన్-స్టోర్, అలాగే పండుగ ప్రచారాల ద్వారా బ్రాండ్ కమ్యూనికేషన్‌కు నాయకత్వం వహిస్తారు.
విజయ్ సేల్స్, భారతదేశపు ప్రముఖ ఓమ్ని-ఛానల్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్, క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ను తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం తరతరాలుగా భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్న రెండు పేర్లను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది—ఒకటి టెక్నాలజీ రిటైల్ రంగంలో, మరొకటి నిజాయితీ, స్థిరత్వం, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పేరు.
ఐదు దశాబ్దాలకు పైగా, విజయ్ సేల్స్ కేవలం ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసే గమ్యస్థానంగా మాత్రమే కాకుండా, కుటుంబాలు తమ తొలి టెలివిజన్ లేదా రిఫ్రిజిరేటర్‌ను ఎంచుకోవడంలో సహాయపడటం నుంచి, ఆ తర్వాత ప్రతి టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లోనూ వారికి మార్గనిర్దేశం చేసే విశ్వసనీయ భాగస్వామిగా నిలిచింది. నమ్మకం, విశ్వసనీయత, నిజాయితీతో కూడిన సలహా అనే ఈ తత్వమే బ్రాండ్ వాగ్దానమైన “Delivering Apnapan (డెలివరింగ్ అప్నాపన్)”లో ప్రతిబింబిస్తుంది. తరతరాలుగా, వివిధ ప్రాంతాల్లో తన విశ్వసనీయత, నిశ్శబ్ద ఆత్మవిశ్వాసంతో ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న రాహుల్ ద్రవిడ్, ఈ విలువలకు సహజమైన ప్రతిరూపంగా నిలుస్తారు.
ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, శ్రీ నిలేష్ గుప్తా, డైరెక్టర్, విజయ్ సేల్స్,“విజయ్ సేల్స్ ఎల్లప్పుడూ లావాదేవీల కంటే సంబంధాలపై నిర్మించబడిన బ్రాండ్‌గా నిలిచింది. కస్టమర్‌కు ఏమి కావాలో అర్థం చేసుకోవడం, సరైన సలహా ఇవ్వడం, కొనుగోలు తర్వాత కూడా వారికి అండగా నిలవడం—నమ్మకం, ఆత్మీయతతో కూడిన ఈ విధానమే ఐదు దశాబ్దాలుగా మా గుర్తింపుగా నిలిచింది. రాహుల్ ద్రవిడ్ ఈ విలువలకు భారతదేశం నలుమూలల ప్రజలు సులభంగా అనుసంధానమయ్యే ప్రామాణికతతో ప్రతిరూపంగా నిలుస్తారు. మేము మా తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెడుతున్న వేళ, బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఆయనే అత్యంత సహజమైన భాగస్వామి,” అని అన్నారు.
విజయ్ సేల్స్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, శ్రీ రాహుల్ ద్రవిడ్, “కొన్ని బ్రాండ్‌లు ప్రజల జీవితాల్లో భాగమవుతాయి. అవి కేవలం విక్రయించే ప్రోడక్టుల వలన మాత్రమే కాదు, వారు పెంపొందించే విశ్వాసం, అనుబంధం వల్ల కూడా అలా నిలుస్తాయి. విజయ్ సేల్స్ దశాబ్దాలుగా కుటుంబాలతో అలాంటి బంధాన్ని ఏర్పరచుకుంది. ముఖ్యంగా ‘Delivering Apnapan’ వెనుక ఉన్న సరళత, ఆత్మీయత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజయ్ సేల్స్‌తో భాగస్వామ్యం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ బ్రాండ్ భవిష్యత్ ప్రయాణంలో భాగం కావడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,” అని అన్నారు.
విజయ్ సేల్స్ తన ఓమ్నిచానెల్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసుకుంటున్న తరుణంలో ఈ భాగస్వామ్యం చోటుచేసుకుంది. తన స్టోర్లలో అందించే విశ్వసనీయత, నైపుణ్యంతో పాటు ఆన్‌లైన్ షాపింగ్ సౌలభ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ద్రవిడ్ బ్రాండ్‌కు సంబంధించిన రాబోయే 360-డిగ్రీల కమ్యూనికేషన్‌లో—టెలివిజన్, డిజిటల్, సోషల్ మీడియా, ఇన్-స్టోర్, ఇతర వినియోగదారుల టచ్‌పాయింట్లలో—ప్రముఖంగా కనిపించనున్నారు. అలాగే, ఏడాది పొడవునా నిర్వహించే కీలక ఉత్పత్తి విభాగాల, పండుగ ప్రచారాలకు ఆయన ప్రధాన ముఖంగా నిలవనున్నారు. ఈ భాగస్వామ్యానికి కేంద్రంగా ఉన్నది తరతరాలుగా విజయ్ సేల్స్‌ను నిర్వచించిన విశ్వాసమే—టెక్నాలజీ మారుతూ ఉండవచ్చు, కానీ నమ్మకం, సంబంధాలు, నిజమైన ఆప్యాయతకు ఉన్న ప్రాధాన్యత మాత్రం ఎప్పటికీ మారదు.
విజయ్ సేల్స్. డెలివరింగ్ అప్నాపన్.









