మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమం

డెక్కన్ న్యూస్ హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. భారీ పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండెపోటుకు గురైన ఆయనకు వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అనంతరం యశోదకు తరలించారు. సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్, ఏసీఎల్ఎస్ నిర్వహించి గుండె స్పందన పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. EEG, MRI, CT స్కాన్లలో మెదడుకు ఆక్సిజన్ లోపం (అనాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్) సంకేతాలు కనిపించినట్లు వెల్లడించారు. జూలై 29న 72 గంటల న్యూరాలజికల్ రీ-అసెస్‌మెంట్ నిర్వహించిన అనంతరం ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.