భక్తి ముసుగులో రాసలీలలు

భక్తి పేరుతో ఓ దొంగ స్వామి మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దేవాలయానికి వచ్చే అమాయక మహిళల్ని పూజల పేరుతో లైంగికంగా లొంగదీసుకుంటున్న పూజారి వేల్పూరి రామును జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరుతో శారీరకంగా వాడుకోవడమే కాకుండా మహిళల ఆస్తులపై కన్నేయడంతో ఈ పూజారి లీలలు వెలుగులోకి వచ్చాయి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్బెస్టస్ కాలనీలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా ఉన్నాడు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పూజారి వేల్పూరి రాముపై ఐపీసీ 417,354A,354C,506,376(2)(N),384 r/w, 109 సెక్షన్లతో పాటు 66E, 67A ఐటీ యాక్ట్ కేసు నమోదు చేశారు. పూజారికి సహకరిస్తున్న అతని సోదరి కూర్మాచలం విజయలక్ష్మి ని సైతం పోలీసులు అరెస్టు చేశారు.