మరణించి ముగ్గురిని బ్రతికిించిన రైతు

ఇంటి పెద్ద మరణించి శోకసంద్రంలో ఉన్నా… ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ మార్గదర్శంగా మారింది. కుటుంబ పెద్ద మరణిస్తే అతని అవయవాలు దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే … ఖమ్మం జిల్లా కొత్తగుడెం ప్రాంతానికి చెందిన ముప్పారవు రవికుమార్ రెడ్డి (39) వృత్తిరీత్యా రైతు. జనవరి 31 వ తేదీన తీవ్రమైన తలనొప్పి రావడంతో ఖమ్మంలోని స్థానికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెదడలో రక్తం గడ్డకట్టడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. అతన్ని రక్షించడానికి వైద్యులు ఎంతో శ్ర‌మించారు. కానీ దురుదృష్ట‌వశాస్తూ శనివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు.
ఆ త‌ర్వాత అవ‌య‌వ‌దానంపై కిమ్స్ ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయ కర్తలు, మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు, అవ‌గాహ‌న‌ క‌ల్పించారు. అనంతరం వారి అంగీకారంతో లివర్, కిడ్నీలు, లివర్ దానం చేశారు. చ‌నిపోతూ మ‌రొ ముగ్గురి కుటుబంబాల్లో వెలుగులు నింపినందుకు గ‌ర్వంగా ఉంద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. మృతుడికి భార్య పద్మ, కుతూళ్లు ప్రజ్ఞ (17) హాసిని (14) ఉన్నారు. జీవ‌న్‌ధాన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవ‌స‌రం ఉన్న‌చోటికి అవయవాలను తరలించారని జీవన్ దాన్ కమిటీ సభ్యులు తెలిపారు.