రైతుబంధు వెనుక అస‌లు క‌థ ఏందీ?

రైతుబంధు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరైతు క‌దిపిన ఈ మాటే వ‌స్తుంది. ఆనాడు బంధువుగా మారిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రాబంధ‌వులా త‌యారాయ్యాడు. ఇంతకీ రైతుబంధు వ‌ల్ల సీఎం ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రయ్యారా లేక దూర‌మ‌య్య‌రా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

అస‌లు ఈ ప‌థ‌కం ఎందుకు తీసుకొచ్చారు. దీని వ‌ల్ల అధికార పార్టీ పొందిన లాభం ఏంత‌.. నష్ట‌మెంత అనేది తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నం చ‌ద‌వండి… మ‌రోక‌రి తెలియ‌జేయండి.

తెలంగాణ రైతాంగానికి ఓ బంధువాల ఉండాల‌ని, ఆపాద కాలంలో ఆదుకునే గొప్ప ప‌థ‌కంగా పేరు తీసుక‌రావాల‌కున్నారు. కానీ ఈ ప‌థ‌కం తీసుకొచ్చిన రూపు వేరు… క్షేత్ర‌స్థాయిలో అలుముకున్న రూపం వేరు. చిన్న స‌న్న‌కారు రైతులు పంట‌లు వేయ‌డానికి పెట్టుబ‌డిలో కాస్త చేదోడు వాదోడుగా ఉంటుందని రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కం పేరుతో నేరుగా రైతుల బ్యాంకుఖాతాలో డ‌బ్బులు వేస్తోంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీ చ‌ట్ట‌ప‌రంగా ఓట్లు కోనేస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేషుకులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు చూస్తున్న ప‌రిస్థితులు అలాగే ఉన్నాయి.

యాసంగిలో వ‌రి వేస్తే…ఆ ధాన్యంని కేంద్రం కొన‌దు, తాము కూడా ఏం చేయ‌లేం అని రాష్ట్ర ప్ర‌భుత్వం చేతులెత్తేసే ప్ర‌య‌త్నంలో ఉంది. త‌మ అవ‌స‌రాల‌ను బ‌ట్టి రంగులు మార్చే ప్ర‌క్రియ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వం చెప్పిన పంట‌లు వేయ‌క‌పోతే రైతుబంధు ఆపేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ‌శాఖ విధానాల‌ను సిద్దం చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే తెరాస పార్టీ భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే రైతుల ఓట్లు దండుకోవ‌డానికే ఈ ప‌థ‌కం తీసుక‌వ‌చ్చిన‌ట్లు ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంది. ఇటీవ‌ల హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ద‌ళిత‌బంధు ప‌థ‌కంలా, రైతుబంధు అయ్యేట్ట‌ట్లు కనిపిస్తోంది. రాష్ట్ర స‌ర్కార్‌కు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే.. వారిని ఇబ్బందులు నుండి గ‌ట్టేక్కించే ప్ర‌య‌త్నం చేయాలంటే యాధ‌విధిగా రైతుబంధు ప‌థ‌కం కొన‌సాగించాలి.

అయితే ఇక్క‌డ మ‌రో కోణంలో చూస్తే…. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత వేల కోట్ల రూపాయ‌ల మిగులు బ‌డ్జెట్‌లో ఉండేది. ఇప్పుడు అప్పుల కూపంలో కూర‌క‌పోయింది. ఈ అప్పుల నుండి త‌ప్పించుకోవ‌డానికి కేంద్రాన్ని బూచిగా చూపుతూ రైతుబంధు క‌ట్ చేస్తే … అప్పులు త‌గ్గే అవ‌కాశం ఉండ‌వ‌చ్చు అనే ఆలోచ‌న‌లో కూడా ఉంది. అయితే అప్పులు తీసుక‌వ‌చ్చి రైతుల‌ను ఆదుకోవాల్సిన అవ‌స‌రం లేదు ఇప్పుడు… రైతుల‌కు కావాల్సింది రైతుబంధు కాదు.. పంట‌కు క‌నీసం మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌డం. రైతు పుట్టిన నాటి నుండి ఏనాడు కూడా ఏ ప్ర‌భుత్వం కూడా రైతుల‌కు నేరుగా డ‌బ్బులు ఇవ్వ‌లేదు కానీ తెరాస రైతుల‌కు డ‌బ్బులు ఇచ్చే ప‌థ‌కం తెరాస‌నే తీసుక‌వ‌చ్చింది.

ఇప్పుడు ఆ రైతుబంధుని… బంధువులాగే చూడాల‌ని చెబుతోంది. బంధువు అంటే… చుట్టం చూపులాగా.. ఇంటికి వ‌చ్చిన చుట్టం ఎప్పుడు మ‌న‌ద‌గ్గ‌రే ఉండ‌డు క‌దా… అలాగే ఈ రైతుబంధు కూడా అంతేలా ఉంది.
చూద్దాం కాలం ఏం నిర్ణ‌యం చేస్తుందో.