ఈటలకు భాజపా ఇచ్చిన బంపర్ ఇదేనా ?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కమలం గూటికి చేరడం దాదాపు ఖరారు అయినట్టే. ఇక లాఛానంగా పద్దతి ప్రకారం పార్టీలో చేరడం ఆలస్యం అంటున్నారు ఈటల వర్గీయులు. ఇప్పటికే హస్తినాలో ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాని కలిశారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ నేతలు ఉండనున్నారు. అయితే ఈటల ఈరోజే బీజేపీలో చేరుతాడన్న గ్యారెంటీ మాత్రం రావడం లేదట.. అతను వెంటనే నడ్డా సమక్షంలో బిజెపిలో చేరవచ్చు లేదా టిఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత అధికారికంగా చేరవచ్చని.. అప్పటిదాకా సమయం కోరుతారని అంటున్నారు. ఈటలతోపాటు మరో సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నారు.
అయితే ఈటలకు బీజేపీ బంపర్ ఆఫర్ లు ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. కేంద్ర కేబినెట్ లో ఈటలకు చోటుతోపాటు ఆయన సతీమణికి హుజూరాబాద్ నుంచి బరిలో దిగడానికి అవకాశం ఇచ్చినట్టుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూకబ్జా ఆరోపణలు రావడంతో తనను తాను రక్షించుకోవడానికే ఈటల బీజేపీలో చేరుతున్నారన్న విమర్శలు టీఆర్ఎస్ నుంచి వ్యక్తమవుతున్నాయి.
బీజేపీలో చేరడానికి ముందే ఈటల రాజేందర్ ప్రతి ఒక్కరినీ కలిశాడు. వామపక్ష పార్టీలు కాంగ్రెస్ మరియు తెలంగాణ జన సమితి నేతలను సహా కేసీఆర్ చేతుల్లో అణచివేతకు గురై ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి మద్దతు కోరారు. కేసీఆర్ ను ఎదురించడమే ధ్యేయమని ఈటల నాడు ప్రకటించారు.