రోజా వ‌ద్దు ఇంద్ర‌జనే ముద్దు

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని కార్య‌క్ర‌మం జ‌బ‌ర్ద‌స్త్‌. ఈటీవీ ప్ర‌సారం అవుతున్న ఈ కార్య‌క్ర‌మాన్ని ఎంతో మంది ఆధ‌రిస్తున్నారు. ఈ షోకి పోటీగా ఇత‌ర టీవీలు ఎన్ని ప్లాన్లు వేసినా పోటీని ఇవ్వ‌లేక‌పోయాయి.

ఇలాంటి టైమ్ లో జడ్జ్ ప్లేస్ లో పర్మనెంట్ గా కూర్చున్న రోజా తన వ్యక్తిగత అనారోగ్య కారణాల వల్ల పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్ లోకి సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వచ్చి కూర్చున్నారు.

లక్కీగా ఇంద్రజ ఆ ప్లేస్ లో పెర్ ఫెక్ట్ గా ఫిట్ అయిపోయారు. మనో, ఇంద్రజ కాంబినేషన్ హడావుడి ఏమీ లేకుండా జనాలను ఆకట్టుకుంటోంది. ఇలాంటి టైమ్ లో మళ్లీ జడ్జ్ ప్లేస్ లో రోజా రావడం అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.
మ‌రోవైపు వందలు, వేలు కామెంట్లు. రోజా వద్దు బాబోయ్…ఇంద్రజ నే కావాలి. ఇంద్రజనే బాగుంది. ఆమె బిహేవియర్ నే బాగుంది. రోజా ఓవర్ యాక్షన్ వద్దు..ఇలా రకరకాల కామెంట్లతో యూ ట్యూబ్ విడియో కింద హల్ చల్ చేస్తున్నారు. కానీ మల్లెమాల యూనిట్ రోజాను కాదని అంటుందని అనుకోవడానికి లేదు.
ఇప్పటి వరకు ఎవరు పక్క సీట్లో వున్నా, ఇటు మాత్రం రోజానే వుంటూ వస్తున్నారు. అందువల్ల కామెంట్లు చూసీ చూడనట్లు వదిలేసి రోజానే కంటిన్యూ చేస్తారనుకోవాలి.