కరోనా వ్యాక్సిన్ కోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొండి
కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ను ఇకపై తమ ఏజెంట్స్ యాప్, వెబ్‌సైట్లలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా రాపిపే ప్రకటించింది. ఈ యాప్ దేశంలో దాదాపు 5 లక్షలకు పైచిలుకు రీటైలర్లు, వ్యాపారస్థులు వాడుతున్నారు.
కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కేంద్రాలు గుర్తించడం, టీకా వేయించుకొనేందుకు స్లాట్ బుక్ చేసుకోవడం వంటి విషయంలో ప్రముఖ చెల్లింపుల సంస్థ అయిన ర్యాపీ పే ఫిన్ టెక్ తనవంతు పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చింది. కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ను ఇకపై తమ ఏజెంట్స్ యాప్, వెబ్‌సైట్లలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా ప్రకటించింది. ర్యాపీ పేకు చెందిన ఏజెంట్ మొబైల్ యాప్ దేశంలో దాదాపు 5 లక్షలకు పైచిలుకు రీటైలర్లు, వ్యాపారస్థులు వాడుతున్నారు. ఈ క్రమంలో తాము కొవిడ్ రిజిస్ట్రేషన్‌ను తమ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా చేసుకొనేలా ఏర్పాటు చేసినట్లుగా సంస్థ ఈరోజు ఓ ప్రకటన విడుదల చేసింది.
వ్యాక్సిన్ కేంద్రం ఎక్కడుందో వెతకడం లేదా టీకా వేయించుకొనేందుకు నమోదు చేసుకొనేందుకు రాపిపే వెబ్‌సైట్, యాప్‌లో తాము ఒక టూల్ వాడుతున్నామని, దాన్ని సెలక్ట్ చేసుకోవడం ద్వారా యూజర్లు నేరుగా కోవిన్ (CoWIN) వెబ్‌సైట్‌లోకి రీ డైరెక్ట్ చేయబడతారని సంస్థ పేర్కొంది. లక్షల్లో ఉన్న రాపిపే ఏజెంట్లు రోజూ ఈ యాప్ వాడడం వల్ల కోట్ల మంది కస్టమర్లతో అనుసంధానమై ఉంటున్నారని సంస్థ వివరించింది. ఈ యాప్ ద్వారానే ఏజెంట్లు తమ వినియోగదారులకు స్థానికంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న కేంద్రాల గురించి లేదా టీకా వేయించుకొనేందుకు స్లాట్ బుక్ చేసుకునేందుకు సాయపడవచ్చని తెలిపింది.
తమ వెబ్‌సైట్, యాప్‌లో ఈ సదుపాయంపై రాపిపే సీఈవో యోగేంద్ర కశ్యప్ మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమకు తాము సొంతంగా ఆరోగ్యసేతు, కోవిన్ యాప్‌ల ద్వారా వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకోలేకపోతున్నారు. అందుకే, ఇలా బుక్ చేసుకొనే సదుపాయాన్ని మా బిజినెస్ ఔట్‌లెట్ల ద్వారా కల్పిస్తున్నాం. దీనివల్ల ఎక్కువ మంది దీన్ని వినియోగించుకొని స్లాట్‌లు బుక్ చేసుకోవడం ద్వారా వ్యాక్సిన్ సెంటర్ల వద్ద జనం తాకిడి తగ్గుతుందని భావిస్తున్నాం’’ అని అన్నారు.