ఉద్యోగుల కుటుంబాల‌కు అండగా ఉంటాం

కోవిడ్ బారిన పడిన తమ ఉద్యోగుల కుటుంబాలకు సకాలంలో సహాయ హస్తం అందించుటకు, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ప్రివెన్షన్-క్యూర్-సెక్యూరిటీ(PCS)అనే తమ త్రి-విధ కార్యక్రమానికి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు చేర్చి, దీన్ని అన్ని బ్యాంకులలో ఒక అత్యంత విస్తృతమైనఉద్యోగుల సంక్షేమ కార్యక్రమంగా తీర్చిదిద్దింది. తమ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక, వైద్య మరియు విద్యా సహకారాలు అందించుట ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈబ్యాంకుచనిపోయినఉద్యోగి యొక్క ఫిక్సెడ్ సాలరీ 50 శాతంకు సమానమైన ఆర్థిక పరిహారాన్ని,అత్యధికంగా
రూ. 5,00,000 పరిమితికి లోబడివారి కుటుంబాలకు రెండు సంవత్సరాల వరకు అందజేస్తుంది. చనిపోయినతమ ఉద్యోగుల అనధికృత ESOPల నిర్వహణ మరియు వినియోగ అధికారాన్ని వారి వారసులు ఉపయోగించు కొనుటకు వీలుగా మార్పులు చేయుటబ్యాంకు తీసుకున్న మరొక ముఖ్యమైన చర్య. కోవిడ్ ని ఎదుర్కొంటున్నతమ ఉద్యోగుల కుటుంబాలకు సహాయం అందజేసే ఉద్దేశంతో ఈ రెండు చర్యలు తీసుకోబడినవి.
దీనికి అదనంగా, చనిపోయిన (కోవిడ్ లేదా ఇతర కారణం వలన) ఉద్యోగి పిల్లల (ఇద్దరు వరకు)యొక్క విద్యకు సంబంధించిన ఖర్చులు, అవసరం ఆధారంపై, వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు బ్యాంకు భరిస్తుంది.బ్యాంకుఈ స్కీమ్ లో చనిపోయిన ఉద్యోగులపిల్లలకుఒక్కొక్కరికి గ్రాడ్యుయేషన్ ముందు చదువుల కొరకునెలనెలా రూ. 5000 మరియుగ్రాడ్యుయేషన్చదువుతున్న సమయంలో వారికి ఒక్కొక్కరికినెలనెలా రూ. 10,000 చొప్పునవిద్యా ఉపకార వేతనం విడుదల చేస్తుంది.సంజయ్ మరియు జ్యోతి అగర్వాల్ ఫౌండేషన్మరియు ఎయు బ్యాంక్ ఉద్యోగుల ద్వారా ఈ విద్యా ఉపకార వేతనం అందజేయ బడుతున్నది. 1 ఏప్రిల్, 2021 న లేదా ఆ తర్వాత కోవిడ్ బారిన పడిన ఉద్యోగుల యొక్క తక్షణ కుటుంబ సభ్యులకు ఈ ప్రయోజనాలు అన్నీ లభించును.
‘ప్రివెంషన్’ చర్యలో భాగంగా బ్యాంకు ఒక కొత్త ప్రథమ చర్య కూడా తీసుకుంది, దీని వలన గ్రూప్ మెడిక్లైమ్ పాలసీ మిడ్ టర్మ్ లో ఉద్యోగులు తమ తల్లిదండ్రులను చేర్చుటకు అనుమతించ బడుతుంది.
ఇవి బ్యాంక్ ఇప్పటికే అందజేస్తున్న లైఫ్ ఇన్స్యూరెన్స్, మెడికల్ఇన్స్యూరెన్స్, మరియు వడ్డీ లేని సాలరీ అడ్వాన్స్, పెయిడ్ కోవిడ్ లీవ్స్, మరియు మెడికల్ ఎమర్జన్సీలకు అదనపు ఆర్థిక సహకారం వంటిఇతర శాసన సంబద్ధ ప్రయోజనాలకు అదనంగా అందించబడుతున్నఅదనపు ప్రయోజనాలు.
“క్రిందటి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రాణ నష్టం మరియు జీవన ఆధారాల నష్టం పట్ల మేము ప్రపంచంతో సంఘీభావం పాటిస్తూ ఉన్నాం. మేము ఈ సంవత్సరం, ఒక ముఖ్యమైన సస్టైనబిలిటీప్రథమ చర్యాగా మా ఉద్యోగులకు ఆర్థిక సాయం మరియు సహకారం అందించుటకు,ప్రివెన్షన్-క్యూర్-సెక్యూరిటీ (PCS) అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇండియాలో కోవిడ్-19 వేవ్ కేసుల కారణంగా, చాలా కుటుంబాలు మెడికల్ మరియు ఆర్థిక సహాయం లేకుండా కష్టపడటం చూస్తున్నాం. మనం పొగొట్టుకున్న మన ప్రియమైనవారి లోటును ఏ ఆర్థిక సహాయం తీర్చలేదు, ఒక సంస్థగా మనం కుటుంబాలతో సంఘీభావం కలిగి వుండి, వారి దుఖాన్ని దూరం చేసి, మెరుగైన రేపటి కోసం వారికి సహకరించటం ముఖ్యం,”అన్నారుశ్రీ సంజయ్ అగర్వాల్, ఎమ్.డి &సి.ఇ.ఒ,ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.
ఈ బ్యాంకు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనవంటి ప్రోగ్రాములలో థర్డ్ పార్టీ పేరోల్ లో ఉన్న స్టాఫ్ తో సహా, ఏ స్కీమ్ లోనూ చేరని ఉద్యోగుల విషయంలో వారిని చేర్చి, వారికి మొదటి సంవత్సరానకి వార్షిక ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్ కూడా చెల్లిస్తారు.
దేశంలో పెరుగుతున్నకోవిడ్ పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని, బ్యాంకు హెచ్.ఆర్ డిపార్టుమెంట్ లో ఉద్యోగుల సంక్షేమం, మేలు మరియు సంతోషం కొరకు, ఐసొలేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఫుడ్, ట్రాన్సుపోర్టేషన్మరియు మెడికేషన్ అవసరాల కొరకు ఒక ప్రత్యేకమైన విభాగం ప్రారంభించింది.
ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి:
ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్(AU Bank) ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ మరియు ఫార్చ్యూన్ ఇండియా 500 కంపెనీ. రాజస్థాన్ అంతర్భాగంలో సేవల నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఎయు బ్యాంకు, నేడు తన రోబస్ట్ బిజినెస్ మోడల్ నిర్మాణానికి ఉపయోగపడే రూరల్ మరియు సెమీ అర్బన్ మార్చెట్ల చక్కని గ్రాహ్యతతో, దీని అభివృద్ధికి సహకరించినలోతైనఅవగాహన కలిగిన ఒక అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. 25 సంవత్సరాల రీటైల్ ప్రధాన్యత మరియు కస్టమర్ ప్రాధాన్యత సంస్థగా అనుభవం సాధించిన ఎయు, తన బ్యాంకింగ్ ఆపరేషన్లు ఏప్రిల్ 2017 లో ప్రారంభించింది మరియు 31 మార్చి 2021 నాటికి, ఇది 744 టచ్ పాయింట్లలో ఆపరేషన్లు స్థాపించి, 15 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెర్రిటరీలలో22,484 ఉద్యోగుల టేలంట్ ఆధారంతో 20.2 లక్షల ఖాతాదారులకు సేవలు అందిస్తున్నది. ఈ బ్యాంకు ₹6,275 కోట్ల నెట్ విలువ, ₹35,979 కోట్లడిపాజిట్ ఆధారం మరియు ₹ 34,609కోట్ల నెట్ అడ్వాన్స్ కలిగి ఉంది. ఎయు బ్యాంక్అనేకమంది విస్తృత ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొని, రెండుప్రముఖఎన్.ఎస్.ఇ మరియు బి.ఎస్.ఇస్టాక్ ఎక్ఛేంజులలో లిస్ట్ చేయబడినది. ఇది CRISIL, ICRA, CAREమరియు ఇండియా రేటింగ్స్ వంటి మేజర్ రేటింగ్ ఏజన్సీలలోఅత్యున్నత ఎక్స్టర్నల్ క్రెడిట్ రేటింగ్ నిరంతరంగా కొనసాగిస్తున్నది.