బెంగుళూరు నుండి బ్రిట‌న్‌కి వెయ్యి మంది న‌ర్సులు, అందుకే

బ్రిటన్‌దేశంలోని జాతీయ ఆరోగ్యశాఖ వెయ్యి మంది నర్సుల సేవలు అవసరమని కోరిన మేరకు రాష్ట్రం నుంచి పంపుతున్నట్టు నైపుణ్యాభివృద్ధి, ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ తెలిపారు. వెయ్యిమంది నర్సులను లండన్‌కు పంపనున్నట్టు తెలిపారు. నైపుణ్యా భివృద్ధిశాఖ, ఎన్‌హెచ్‌ఎస్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. వెయ్యిమంది నర్సులను బ్రిటన్‌కు పంపుతున్నామని, కొవిడ్‌ క్లిష్ట సమయం ముగిశాక పంపుతామన్నారు. ఇప్ప టికే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. బ్రిటన్‌ దేశానికి అనుగుణంగా భాష, ఆ ప్రాంతం లోని పరిస్థితులు తదితర అంశాలపై వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. బ్రిటన్‌తో పాటు ఇతర దేశాలు, నర్సింగ్‌ పారామెడికల్‌ సిబ్బంది కోరితే నైపుణ్యాభివృద్ధిశాఖ ద్వా రా పంపుతామన్నారు. నర్సింగ్‌ సిబ్బందికి అధికారస్థాయి హోదా కల్పించదలిచామని ముఖ్యమంత్రితో ఈ అంశం చర్చించదలిచామన్నారు. దేశవ్యాప్తంగా 2లక్షలమంది న ర్సులను వివిధ ఆరోగ్యకేంద్రాలకు అవసరం కాగా ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆది చుంచనగిరి మఠాధిపతి సంఘాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ శోభాకరందా జే, కన్నడ అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు నాగారభరణ, నైపుణ్యాభివృద్ధి మండలి అధ్య క్షుడు రాఘవేంద్ర బేళూరు, గోపాల కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.