ఈ టైంలో శృంగారం కావ‌లంటే నెల ఆగ‌ల్సిందే

  • కోట్లు మందిని తొలుస్తున్న ప్ర‌శ్న ఇదే
  • క‌రోనా టైంలో శృంగారం

డెక్క‌న్న్యూస్‌, హెల్త్ బ్యూరో –

క‌రోనా లౌక్‌డ‌న్‌లో చ‌డి చ‌ప్పుడు కాకుండా చాలా పెళ్లిళ్లు జ‌రిగాయి. క‌రోనా నుండి కోలుకున్న త‌ర్వాత కూడా కొన్ని పెళ్లిళ్లు జ‌రిగాయి. అయితే ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల మందికి ఇది ఒక్క‌టే ప్ర‌శ్న‌. క‌రోనా వ‌చ్చి కోలుకున్న త‌ర్వాత శృంగారం చేయ‌వ‌చ్చా అని.

అవ‌గాహాన లేమితో ఇప్ప‌టికే చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. అంతేకాకుండా లౌక్‌డౌన్ క‌లిసి రావ‌డంతో ఇంట్లో టైం దొర‌క‌డంతో చాలా మంది త‌మ భాగ‌స్వాముల‌తో క‌లుస్తున్నారు. క‌ల‌యిక త‌ర్వాత అనేక మంది వివిధ స‌మ‌స్య‌ల‌తో స్త్రీల వైద్య నిపుణుల దగ్గ‌రి వ‌స్తున్నారు.

భార్యాభర్తల్లో ఎవరికైనా కరోనా వస్తే కనీసం నెల పాటు శృంగారానికి దూరంగా ఉండాలని చెప్తున్నాం. తొందరపడి ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకోవద్దు. కనీసం మూడు నెలలపాటు వేచి ఉండటం మంచిది. అనుకోకుండా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే ఏమీ చేయలేం. కరోనా వల్ల అబార్షన్‌ అవుతుందని భావించలేం. అబార్షన్‌ చేసుకోవాల్సిన అవసరమూ లేదు.