కొండాపూర్ ఆసుప‌త్రి నుండి 500 డోసుల కోవిషీల్డ్ మాయం

కొండాపూర్ ఏరియా ఆసుప‌త్రి నుండి 500 వంద‌ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాయమైపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. క‌రోనా క‌ట్టడిలో వ్యాక్సిన్ త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రికి చేరాలనే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం క‌ఠిణ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంది. అయినా కానీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల సూప‌రిండెంట్‌లు, న‌ర్సుల‌, అటెండ‌ర్ల నిర్ల‌క్ష్యంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ చోరికి గురైనాయి. దీంతో ఈ వ్య‌వహారం గ‌చ్చిబౌలి పోలీస్‌స్టేష‌న్‌కి చేరుకుంది. సూప‌రిండెంట్ త‌ప్పిదం వ‌ల్ల ఇది జ‌రిగింద‌ని, త‌మ త‌ప్పు ఏమాత్రం లేద‌ని న‌ర్సులు, అటెండ‌ర్లు చెబుతున్నారు. అయితే దీనిపై నిజా నిజాలు తేలియాలంటే ఖ‌చ్చిత‌మైన విచారణ జ‌ర‌గాల్సి ఉంది.