హెల్త్‌కేర్‌ వర్కర్లను సత్కరించిన నొవోటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌

భయంకరమైన అంటువ్యాధి కరోనా వైరస్‌ ఎప్పుడైతే విజృంభించడం మొదలైందో అప్పటి నుంచి ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, వలెంటీర్లు నిస్వార్థంగా 24 గంటలూ పనిచేయడంతో పాటుగా పరిస్థితులను నియంత్రణలోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. ఈ గుర్తింపుకు నోచుకుని హీరోలను గౌరవించే లక్ష్యంతో నొవోటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌సీసీ) ముందుకు రావడంతో పాటుగా గచ్చిబౌలిలోని కమిషనర్‌ ఆఫీస్‌ వద్ద ఉన్నటువంటి సొసైటీ ఆఫ్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) వలెంటీర్లకు ఆత్మీయ ఆతిథ్యం ఏర్పాటుచేసింది. ఈ లంచ్‌ కార్యక్రమానికి తెలంగాణా అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ మరియు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ వీ సీ సజ్జనార్‌ తో పాటుగా సిబ్బంది, ఎస్‌సీఎస్‌సీ వలెంటీర్లు హాజరయ్యారు.
సొసైటీ ఆఫ్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) ప్రత్యేకంగా పడకలు, ఆక్సిజన్‌, అంబులెన్స్‌లు మరియు ఇతరవైద్య అవసరాల కోసం వెదుకుతున్న ప్రజలకు సహాయపడుతూ ప్రత్యేకంగా ఓ ప్రచారం ప్రారంభించింది. దీనికోసం ఎస్‌సీఎస్‌సీ ప్రత్యేకంగా ఓ బృందాన్ని (వలెంటీర్ల బృందం) ఏర్పాటుచేసింది. ఈ బృందం కోవిడ్‌ రోగులను ఆస్పత్రులతో కలుపడంతో పాటుగా వారి చికిత్సకు తగిన మద్దతును అందిస్తుంది. ఈ ఫుడ్‌ మెనూ ప్రత్యేకంగా ఈ మహమ్మారి వేళ వైరస్‌తో పోరాడేందుకు అవసరమైన పోషకాలను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దడం జరిగింది. ఈ హోటల్‌ అన్ని సురక్షిత మరియు పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడంతో పాటుగా భోజనాలను అందిస్తుంది.
మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీ వద్దనున్న మెడికవర్‌ హాస్పిటల్స్‌లోని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మరియు డాక్టర్లకు 200కు పైగాభోజనాలను సైతం ఎన్‌హెచ్‌సీసీ అందించింది. వారి అంకితభావం, ప్రాణాలను కాపాడటంలో వారు పడుతున్న కష్టం, ఈ సంక్షోభ సమయంలో మానవత్వంతో వారు అందిస్తోన్న సేవలకు గౌరవ సూచికగా ఈ భోజనాలను అందించడం జరిగింది.

నొవోటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ మనీష్‌ దయ్యా మాట్లాడుతూ ‘‘మహమ్మారితో మన పోరాటం కొనసాగుతున్న వేళ, వలెంటీర్లు మరియు వైద్య కమ్యూనిటీ అసలైన హీరోలుగా వెలుగొందుతుండటంతో పాటుగా ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సమాజానికి తోడ్పాటునందిస్తున్నారు. ఫ్రంట్‌ లైన్‌ కార్మికులకు సురక్షితమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం ఇప్పుడు తక్షణావసరం అని భావిస్తున్నాం. వారి పట్ల మా గౌరవం చూపుతూనే వారు చేస్తోన్న సేవలను ప్రశంసిస్తూ మేము సొసైటీ ఆఫ్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) వలెంటీర్లుకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటుచేయడంతో పాటుగా మెడికవర్‌ ఆస్పత్రి సిబ్బందికి సైతం భోజనాలను ఏర్పాటుచేశాం. ఎన్‌హెచ్‌సీసీ వద్ద తాము మన కమ్యూనిటీల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉండటంతో పాటుగా భవిష్యత్‌లో సైతం ఈ తరహా కార్యక్రమాలకు మద్దతును కొనసాగించనున్నాం’’ అని అన్నారు.

ఎస్‌సీఎస్‌సీ వలెంటీర్లు మరియు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు నొవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ బృందం ఏర్పాటుచేసిన ఆత్మీయ కార్యక్రమాన్ని తెలంగాణా రాష్ట్ర అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మరియు సైబరాబాద్‌ పొలీస్‌ కమిషనర్‌ శ్రీ వీ సీ సజ్జనార్‌ ప్రశంసించారు. ఇతర కార్పోరేట్లు కూడా ముందుకు రావడంతో పాటుగా కోవిడ్‌ –19 తో జరుగుతున్న పోరాటంలో చేతులు కలుపాల్సిందిగా కోరారు.