క‌ర్నాట‌క‌లో మొద‌లైన క‌రోనా థ‌ర్డ్ వేవ్ ?

అంద‌రూ ఊహించిన‌ట్టుగానే భార‌త‌దేశంలో క‌రోనా మూడో ద‌శ మొద‌లైన‌ట్టు సంకేతాలు పంపుతోంది క‌ర్నాట‌క రాష్ట్రం. ఇటీవ‌ల లాక్‌డౌన్ విధించిన ఎటువంటి ఫ‌లితాలు అక్క‌డ రావ‌డం లేదు. అంతేకాకుండా ఇప్పుడు పెద్ద వారితో పాటు చిన్న పిల్ల‌ల్లో కూడా క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌తుంది.
క‌రోనా మూదోద‌శ‌లో పిల్ల‌లే ఎక్క‌వ ఆ క‌రోనా బారీన ప‌డుతార‌ని దేశ వ్యాప్తంగా వైద్యులు వెల్ల‌డించిన సంగ‌తి విదిత‌మే.
ఇందుకు నిద‌ర్శ‌నంగానే క‌ర్నాట‌క‌లో ఇటీవ‌ల మార్చి నుంచి మే వరకు 9 ఏళ్లలోపు వారిలో ఏకంగా 39, 846మంది కరోనా బారిన పడగా…10 నుంచి 19 ఏళ్ల కేటగిరీలో అయితే రికార్డు స్థాయిలో1,05,044 మందికి కరోనా సోకింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. గతేడాది దేశంలో కరోనా తొలి కేసు మొదలైనప్పటి నుంచి 2021 మార్చి వరకు కరోనా కేసులు నమోదైన తీరును పరిశీలిస్తే 9 ఏళ్లలోపు 27, 841 కేసులు ఉండగా 10 నుంచి 19 ఏళ్ల లోపు వారు 65,551గా నమోదైంది.

అంటే స్వల్ప వ్యవధిలోనే చిన్నారుల్లో 145 శాతం అధికంగా టీనేజ్‌ పిల్లల్లో 160 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. మరణాల్లోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. గతేడాది నుంచి మార్చి వరకు 9 ఏళ్ల లోపు వారు 28 మంది చనిపోగా కేవలం ఈ రెండు నెలల్లోనే ఇప్పటికే 15 మందికి పైగా కోవిడ్‌ బారిన పడ్డారు. టీనేజ్‌పిల్లల దగ్గరికి వచ్చే సరికి మరణాల సంఖ్య46 నుంచి 62 కి చేరుకుంది. ఇంట్లో కరోనా సోకిన పెద్ద వాళ్లకు ప్రైమరీ కాంటాక్టుగా పిల్లలు ఉండటం వల్లనే చిన్న పిల్లలు కరోనా బారిన పడుతున్నారనే వాదనలు ఉన్నాయి.

ఫస్ట్‌వేవ్‌లో పెద్ద వయసువారు, సెకండ్‌ వేవ్‌లో యువత కరోనా బారిన పడ్డారు. థర్డ్‌ వేవ్‌లో చిన్నారులకు ముప్పు ఉంటుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. చిన్నారులు కరోనా బారిన పడటానికి కారణం ఇండియన్‌ స్ట్రెయినా, సింగపూర్‌ స్ట్రెయినా అనే వాదనలు కొనసాగుతుండగానే కర్నాటకలో చిన్నారుల్లో పెరుగుతున్నకేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పద్దేనిమిదేళ్లు దాటిన వారికే ప్రస్తుతం టీకాలు ఇచ్చే పరిస్థితి దేశంలో కనిపించడం లేదు. ఇప్పుడు 18 ఏళ్లలోపు ఏజ్‌ గ్రూప్‌లోనూ కేసులు పెరగడం కలవరం కలిగిస్తోంది.