వేపాకు చేస్తుంది ఎంతో మేలు : డా. స్ర‌వంతి

ఆరోగ్యమైన చర్మం కోసం అమ్మాయిలు పడే తంటాలు అన్నీఇన్నీ కావు.ఫెయిర్​నెస్​ క్రీమ్​లు, లోషన్స్, సబ్బులు.. ఇలా రకరకాల ప్రొడక్ట్స్​ వాడుతుంటారు. కానీ, ఆ బ్యూటీప్రొడక్ట్స్​లో ఉండేది వేపనూనె, వేపాకులే. మరి ఆ వేపాకు, వేప నూనెల్ని నేచురల్​గానే వాడొచ్చు కదా. అర టీ స్పూన్​ వేపనూనెలో కొద్దిగా ముల్తానీ మట్టి వేసి నీళ్లు కలిపి పేస్ట్​చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై మొటిమలు, మచ్చలున్న చోట రాయాలి. అది బాగా ఆరాక శుభ్రంగా కడిగేయాలి. ఇలా రెగ్యులర్​గా చేస్తే మొటిమల సమస్య ఉండదు. వేపనూనెలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మొటిమలు, మచ్చలు, కంటి కింద నల్లటి వలయాలను, చర్మంపై దద్దుర్లని తగ్గిస్తాయి.

గుప్పెడు వేపాకుల్ని అరలీటరు నీళ్లలో వేసి స్టవ్​పై మరిగించాలి. నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాక ఆ కషాయన్ని వడగట్టాలి. మిశ్రమం పూర్తిగా చల్లారాక సీసాలో పోయాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీళ్లలో దూది ముంచి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు పోతాయి. ఇదే కషాయాన్ని బకెట్ నీళ్లలో వేసుకుని స్నానం చేసినా చర్మంపై దద్దుర్లు పోతాయి. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. మెరుస్తుంది కూడా. సన్​టాన్​ సమస్య కూడా ఉండదు.