చైనాలో పెళ్లి కానీ ప్రసాదులే ఎక్కువ
ప్రపంచంలో అత్యధిక జనభా కలిగిన దేశం చైనా, ఇప్పటికే ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఇటీవలే మరో రికార్డ్‌ను తన సొంతం చేసుకుంది. దేశంలో ఎక్కువగా అంటే దాదాపు 3 కోట్లకుపైగా పురుషులు పెళ్లి కాకుండా ఉన్నారని తాజాగా ఆ దేశం చేసిన సర్వేలో వెల్లడైంది. చైనా జనాభా లెక్కల వివరాలను మే 11వ తేదీన విడుదల చేసింది.
ఈ లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు తగ్గడం ఆందోళన కలిగించే అంశం. అయితే చైనా పాటించిన విధానం ప్రభావంతో ప్రస్తుతం పెళ్లి కాని పురుషులు అధికంగా ఉన్నారు. లింగ సమతుల్యత పాటించకపోవడం వలన ఈ సమస్య ఏర్పడిందని మేధావులు చెబుతున్నారు. 30 మిలియన్ల(3 కోట్లు) పెళ్లి కాని పురుషులు ఉన్నారని చైనా ఏడవ జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో 111.3 పురుషులకు వంద మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంతకుముందు 2010లో 118.1 పురుషులకు వంద మంది అమ్మాయిలు ఉన్నారు. గత లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం లింగ నిష్పత్తి కొంత మెరుగైందనే చెప్పవచ్చు. కానీ ఆశించిన స్థాయిలో లింగ నిష్పత్తి లేదు. ఒకరు మాత్రమే అనే విధానంతో లింగ అంతరం సమస్య పెరిగింది.