రాళ్ల‌తో కొట్టుకున్న తెరాస స‌ర్పంచ్‌, ఎంపీటీసీ

వారిద్ద‌రూ తెరాస పార్టీకి చెందిన వారే. అందులోనూ ఒక‌రు ఆ గ్రామ సర్పంచ్ మ‌రొక‌రు ఎంపీటీసీ. న‌లుగురి బుద్దిచెప్పి పంచాయితీల‌ను స‌ద్దుమ‌నిగేలా చేసే వీరే న‌డిబ‌జారులో రాళ్లతో కొట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన చామ‌న్‌ప‌ల్లి గ్రామ స‌ర్పంచ్, ఎంపీటీసీ లక్ష్మ‌య్య మ‌ధ్య చెల‌రేగిన భూ వివాదంలో ప‌ర‌స్ప‌రం రాళ్ల దాడికి చేసుకున్నారు. పెద్ద పెద్ద రాళ్ల‌తో ఇరువురు దాడి చేసుకుంటున్న త‌రుణంలో స్థానికంగా ఉన్న‌వారు నిలువ‌రించ‌డానికి ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది.