2023 తర్వాత సీఎం కేసీఆర్ ఉండడు : ఈటెల
తెలంగాణలో అణిచివేత రాజకీయాలు నడవవని మాజీ మంత్రి ఈటెల అన్నారు. 2023 తర్వాత సీఎం కేసీఆర్ ఉండడు అని జోస్యం చెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనదైన శైలిలో ఈటల విరుచుపడ్డారు. నాగార్జున సాగర్లో జరిగినట్టు ఇక్కడ జరగదని హెచ్చరించారు. తాను దేవుళ్లను మొక్కనని, ప్రజలను మొక్కుతానని అన్నారు. వాళ్ల కష్టాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని తెలిపారు. తల్లి బిడ్డను వేరు చేసేలా సీఎం వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెవరని ఎప్పుడు కొన్నావో అన్ని బయటపడుతాయని వ్యాఖ్యానించారు. అంతట రాజకీయం చేసినట్టు ఇక్కడ చేస్తే కుదరదన్నారు.