ఈటెల పై అప్పుడే బాణం ఎక్కుపెట్టిన కెప్టెన్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆ పార్టీకి చెందిన నాయకులు, అదికూడ ఉద్యమ కాలం నుండి సీఎం కేసిఆర్ తోపాటు ఈటల రాజేందర్‌తో కలిసి నిడిసిన వారు కౌంటర్ అటాక్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు చెందిన వారి చేత ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు పార్టీ అధినాయకత్వం అందుకే ఈటల రాజేందర్ మీడియా ముందుకు వచ్చిన వెంటనే ఆ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు రంగంలోకి దింపారు.
ముఖ్యంగా పార్టీ సీనియర్ నేతలుగా రాజ్యసభ ఎంపీ కెప్టేన్ లక్ష్మికాంతారావు, మాజీ ఎంపీ ,రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్ తోపాటు , మరో సినియర్ నేత నారదాసు లక్ష్మణ్ తో పాటు జిల్లా మంత్రులు కొప్పులు ఈశ్వర్, గంగుల కమాలాకర్‌ను సైతం రంగంలోకి దింపారు.
ఈ నేపథ్యంలోనే ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతారావు ఈటలకు కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్‌కు సీఎం కేసిఆర్ చాలా గౌరవంతోపాటు అనేక అవకాశాలు ఇచ్చారని అన్నారు. ఈటల పార్టీ నేతలకే వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పారు. తన భార్య సరోజన్ ఎంపీపీ అయితే అవిశ్వాస తీర్మాణం పెట్టారని గుర్తు చేశారు. మరోవైపు రైతుబంధును ఆయన వ్యతిరేకించారని చెప్పారు. ఇక హుస్నాబాద్‌కు ఆర్డీవో మంజూరైన దాన్ని హుజురాబాద్‌కు తరలించుకుపోయారని చెప్పారు.
ఇక ఒక మంత్రిపై ఆరోపణలు వస్తే ..చర్యలు తీసుకునే అధికారం సీఎం కు ఉంటుందని , అంతమాత్రానా ఇంత రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. ఈటల ను ఉద్యమకారుడు కాదనలేని నిజమేనని అయితే మంత్రి పదవి పోవడం ద్వార ప్రజాభిప్రాయం సేకరించడం సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడించడం సరైంది కాదని అన్నారు. ఇక సీఎం ఆదేశిస్తే హుజురాబాద్ నియోజకవర్గం నుండి పోటికి చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. కాగా ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ బోమ్మపైనే గెలిచారన్నారు.