ఆ హీరోయిన్‌ వల్లే క్రిష్‌కి విడాకులు ఇచ్చిన భార్య‌

సినిమా ద‌ర్శ‌కుడు క్రిష్‌ జాగర్లమూడి (క్రిష్‌) లేటు వ‌య‌సులో పెళ్లి. అయినా ఒప్పుకుంది ఆ డాక్ట‌ర్ ర‌మ్య‌. అంద‌రి స‌మ‌క్షంతో వైభంగా పెళ్లి అయినా… రెండేళ్ల‌కు ఆ పెళ్లి పెటాకులైంది. ఆ జంట విడిపోవ‌డానికి మాత్రం ఆ హీరోయిన్ కార‌ణ‌మ‌ట‌. కానీ ఎక్క‌డా కూడా ఆ హీరోయిన్ పేరు బ‌య‌ట ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుత‌న్నారు క్రిష్‌.
రమ్య అనే డాక్టర్‌ను 2016 అగష్టు 7న వివాహం చేసుకున్న క్రిష్ ఆ తర్వాత రెండేళ్లకే ఆమెతో విడిపోయాడు. లేటు వయసులో వివాహం చేసుకున్న ఆయన అతి తక్కువ సమయంలో భార్యతో విడిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
దీంతో అప్పట్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే క్రిష్‌.. భార్య రమ్యతో విడిపోవడానికి ఓ హీరోయిన్‌ కారణమట. ఆయన డైరెక్షన్‌లో నటించిన ఓ హీరోయిన్‌తో క్రిష్‌ క్లోజ్‌గా ఉండేవాడట, అది నచ్చని భార్య రమ్య ఆయనను పలుమార్లు హెచ్చరించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ఆయన భార్య విడాకులు కోరడంతో క్రిష్‌ కూడా ఇందుకు సిద్దమయ్యాడట. దీంతో ఇద్దరూ కలిసి విడిపోవాలని నిర్ణయించుకుని 2018లో కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయడం, విడిపోవడం చకచక జరిగిపోయింది.