ఈ సమయంలో శృంగారం చేయవచ్చు : డా. సమరం
కరోనా గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగిపోతోంది. ఈ పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ అంటూ మొదలయ్యింది. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ కరోనా బారిన పడుతున్నారు. వేలాదిమంది ఇప్పటికే కరోనా బారినపడి కన్నుమూశారు. అయితే ఇదే తరుణంలో కరోనా మహమ్మారి చుట్టూ ఎన్నో అపోహలు నెలకొన్నాయి. వీటిలో ముఖ్యమైనది శృంగారం. చాలామందికి ఇదే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. కరోనా వైరస్ కి శృంగారానికి ఏమైనా సంబంధం ఉందా? కరోనా బారినపడకుండా ఉండాలి అంటే శృంగారానికి దూరంగా ఉండి తీరాలి అంటూ కొందరు చెబుతున్నారు.
అయితే ఇదే తరుణంలో ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ సమరం కరోనా మరియు సెక్స్ సంబంధిత విషయాలపై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. అయితే డాక్టర్ సమరం కరోనా సెక్స్ సంబంధ విషయాలపై ఏమి వెల్లడించారు ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ సమరం విజయవాడ నుంచి ఓ యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తరానా చుట్టూ అలుముకున్న అనుమానాలను పటాపంచలు చేశారు. అయితే డాక్టర్ సమరం ఏమన్నారంటే కరోనాకు సెక్స్ కు అసలు సంబంధం లేదు. కరోనా వైరస్ అనేది ముక్కు, కళ్ళు,నోటి ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అంతేగాని సెక్స్ చేస్తే రాదు. అయితే ఒకవేళ సెక్స్ లో పాల్గొనే ఇద్దరిలో ఏ ఒక్క వ్యక్తికి కరోనా ఉన్నా వారి కరోనా వస్తుంది. అలా కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చక్కగా శృంగారంలో పాల్గొనవచ్చు అని డాక్టర్ సమరం వెల్లడించారు.
అయితే ఒకవేళ జనం ఉన్న ప్రదేశానికి వెళ్లి వచ్చినప్పుడు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే శుభ్రంగా స్నానం చేసి, ఆ బట్టలు తీసి ఉతికిన బట్టలు వేసుకుంటే చాలు. ఈ కరోనా బయటికి వెళ్లినప్పుడు ఇతర వ్యక్తుల నుంచి తుమ్ములు దగ్గులు వచ్చినప్పుడు అంటు వ్యాధిలా సోకుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు శృంగారంలో పాల్గొనడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా రాదు. అయితే మనం కరోనాకు భయపడే సెక్స్ ను ఎందుకు దూరం చేసుకోవాలి. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ శుభ్రంగా ఉంటే ఏం రాదు. అయితే ఇలా వచ్చి అపోహలలో మరొకటి ముద్దులు పెట్టుకుంటే కదా నాకు వస్తుందని. అయితే ఇలా ముద్దులు పెట్టుకుంటే కరోనా వస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ముద్దులు పెట్టుకున్నా రొమాన్స్ చేసిన కరోనా రాదు అంటున్నారు డాక్టర్. ఒకవేళ ఎదుటి వ్యక్తి కరోనా ఉంటే మాత్రం కరోనా వచ్చే అవకాశం ఉంది.
అయితే వాస్తవానికి కరోనాపై ప్రజల్లో ఉన్న భయమే చాలా నష్టం చేస్తోంది. నిజానికి, ప్రస్తుత పరిస్థితుల్లో సెక్స్‌లో పాల్గొనడం చాలా అవసరం. శృంగారంలో పాల్గొనడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదల అవుతాయి. అయితే లాక్‌డౌన్, ఎక్కువగా ఇంట్లో ఉండటం వల్ల జనాలు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవతున్నారు. ఇలా డిప్రెషన్‌లో ఉన్న వారు సెక్స్‌లో పాల్గొనడం వల్ల లవ్ హార్మోన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదల అవుతాయి. అయితే దీని వల్ల మనలో ఉన్న డిప్రెషన్, ఒత్తిడి పూర్తిగా తొలిగిపోతాయి. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోండి.అయితే ఒకవేళ కరోనా లేకపోతే, ఎటువంటి ఇబ్బంది లేకుండా శృంగారంలో పాల్గొనవచ్చు. నేనైతే స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తున్నా.. జనాలు ఈ పరిస్థితుల్లో సెక్స్ చేయాలని. ఇంట్లో లాక్‌డౌన్ వల్ల ఉండటం వల్ల.. ప్రేమానురాగాలు పెంచుకోండి. శృంగారాన్ని ఆశ్వాదించడం” అని సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం అన్ని విషయాలను కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించారు