అచ్చంపేట అడవిలో మొదలైన ప్రకంపనలు
రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి ఈటెల భూమల వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలోని అచ్చంపేట, హాకీంపేట, చిన్న శంకరంపేట మండలం ధరిపల్లి పరిధిలోని కొంత మంది వ్యక్తుల సిలింగ్ భూములను వివిధ అవసరాల నిమిత్తం కొనుక్కున్న వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. గత నాలుగైదు సంవత్సరాల నుండి అడవి ప్రాంతంలో ఉన్న వందల ఏకరాల సిలింగ్ భూములు చేతులు మారాయి. ఇప్పటి వరకు అంతా సాపీగానే సాగిన ఇప్పుడు మాత్రం భయం గుప్పిట్లో పడ్డారు.
ఇటీలవ కాలంలో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో సామాన్య ప్రజలు సైతం అప్పో సప్పో చేసి అడవిలో సిలింగ్ భూములు కొనుగోలు చేశారు. కాగా గత వారం నుండి సొంత మంత్రివర్గంలో ఉన్న ఈటెలను టార్గెట్ చేసి అచ్చంపేట, హాకీంపేటలో సీలింగ్ భూముల కబ్జా చేశారని మంత్రివర్గం నుండి ఉపశమనం కల్పించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ స్థలం మీద పడడంతో అక్కడ సామాన్యుల నుండి కోటీశ్వరుల వరకు పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం తమ భవిష్యత్తు ఏమవుతుందో అనే భయంలో పడ్డారు. కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు, మంత్రి, సీనియర్ నాయకుడైన ఈటెలను వదలని ప్రభుత్వం మనల్ని ఎలా వదులుతుంది అనే భయంలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం అడవిలో ఎంత మేరకు సీలింగ్ భూములు ఉన్నాయి, రోడ్డుకు ఇరువైపుల పట్టా భూములు ఎంత మేరకు ఉన్నాయి అనే లెక్కలను తీయనున్నట్లు సమాచారం. ఈ రిపోర్ట్ తన త్వరగా ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ నివేదిక తర్వాత ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈటెల అంశం జరిగే ముందు కూడా ఇలాంటి హడవుడి జరిగిందని స్థానిక నేతలు, అధికారులు అంటున్నారు. అయితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామం జరిగిన భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదని బొగట్ట.