హై కోర్టులో ఈటెలకు ఊరట
భూ కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కి ఊరట లభించింది. అనుమతి లేకుండా ఎలా సర్వే చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్ట్. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని జమున హ్యాచరీస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ మొదలైంది. నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చట్ట ప్రకారం ఆ చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే చీఫ్ సెక్రటరీ నుంచి విచారణ చేయవలసిందిగా ఎప్పుడు ఆదేశాలు వచ్చాయని న్యాయస్థానం ప్రశ్నించింది.
నోటీసులు ఇవ్వకుండా రాజ్‌భవన్,హైకోర్టు భవవనాలపై కూడా విచారణ చేపట్టవచ్చని హైకోర్టు పేర్కొంది. అడ్వకేట్ జనరల్ ఏమో ఇది ప్రిలిమినరీ నివేదిక అని చెప్తారు, హ్యాచరీస్ బయట మాత్రం ప్రభుత్వ భూమి అని బోర్డ్ పెడ్తారని పిటిషనర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కోర్టుకు వివరించారు. విచారణ సమయంలో కనీస ప్రోటోకాల్ పాటించలేదని, 300(a) కన్సిస్టిశనల్ రైట్‌ను ఉల్లంఘించారని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఇంటీర్మ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కోరారు.
అయితే నివేదిక ప్రకారం నేరానికి పాల్పడినట్టు రుజువైందని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. నివేదికలో ఉన్న అంశాలు అన్ని తప్పు ఎలాంటి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. విచారణ సమయంలో అధికారులకు సహకరించాలని అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు.