మహిళల ఆరోగ్య భద్రతకు ఎస్ఎల్‌జి ఆస్పత్రి సేవలు అభినందనీయం
మహిళల ఆరోగ్య భద్రతకు ఎస్ఎల్‌జీ ఆస్పత్రి యాజమాన్యం చేస్తున్న సేవలు, చూపిస్తున్న చొరవ ఎంతో ప్రశంసనీయమని నిజాంపేట్ మేయర్ శ్రీమతి కొలను నీలా గోపాల్‌రెడ్డి గారు అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఎస్ఎల్‌జి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సఖి కార్యక్రమాన్ని ఆస్పత్రుల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దండు శివరామరాజు గారు, ఎస్‌ఎల్‌జి ఆస్పత్రుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ డీవీఎస్ సోమరాజు గారి సమక్షంలో ముఖ్య అతిథిగా హాజరై మేయర్ ప్రారంభించారు.
ముందుగా మహిళల ఆరోగ్య భద్రతకు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫొటో సెషన్‌ను ఆమె ప్రారంభించి ఫొటో సెషన్‌ను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ నీలా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మహిళలు అవగాహన లోపంతో క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారన్నారు. అందుకే మహిళలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే పరీక్షించుకునేందుకు ఎస్ ఎల్‌జీ ఆస్పత్రి ఏర్పాటు చేసిన సఖి ఒక అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఆర్ధికంగా వెనుకబడి సకాలంలో వైద్యపరీక్షలు చేయింకోలోనే స్థితిలో ఉన్న నిజాంపేట సమీప ప్రాంతాల మహిళల సఖి కార్యక్రమం ఒక వరం లాంటిది అని మేయర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళ ఆరోగ్య భద్రతకు వారి శ్రేయస్సుకు ఎస్ఎల్‌జి ఆస్పత్రి యాజమాన్యం చేస్తున్న సేవలు ఎనలేనివని ప్రశంసించారు. నిజాంపేటలోని సమీప ప్రాంతాల మహిళలతో పాటు మరియు జంట నగరాల
ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ , సర్వైకల్ క్యాన్సర్లు ఎంతో ప్రమాదకరమైనవని అందరూ ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు. డాక్టర్లు , వైద్యసిబ్బందికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మేయర్ తాను నిజాంపేట మున్సిపాలిటికీ తొలి మహిళా మేయర్ కావడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళల ఆరోగ్య భద్రతకు ఎన్నో పథకాలు తీసుకొస్తుందని తెలిపారు. అనంతరం ఆస్పత్రి చైర్మన్ అండ్ ఎండీ దండు శివరామరాజు మాట్లాడుతూ మహిళల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించడంలో తమ ఆస్పత్రి ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ పాణిగ్రహి, అంకాలజిస్ట్ డాక్టర్ సురేంద్ర బత్తుల, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.











