ఓటు వేయండి కిమ్స్‌లో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకొండి
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని అన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ వీన పాండ్యాన్. త్వరలో జరిగే కర్నూలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహాన కల్పించడానికి కిమ్స్ హాస్పిటల్స్ విన్నూత కార్యక్రమంతో ముందుకు వచ్చిందన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో కిమ్స్ హాస్పిటల్ రూపొందించిన వాల్ పోస్టర్‌నే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు బాధ్యతగా ఓటు వేసినప్పుడే మార్పు వస్తుందన్నారు. ఓటర్లలలో అవగాహాన పెంచడానికి కిమ్స్ ఇలాంటి కార్యక్రమంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం కలెక్టర్ కార్యలయం నుండి బళ్ళారి చౌరస్తా మీదుగా రాజ్‌వీహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓటర్లకు మరింత అవగాహాన పెంచడానికి కిమ్స్ హాస్పిటల్ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, హాస్పిటల్ సిబ్బంది రావీ శ్రీనివాస్, శివరామకృష్ణ, సుధీర్, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు.











